Devisri Prasad: హీరోగా మ్యూజిక్ మిసైల్... హీరోయిన్ కూడా ఫిక్స్
ABN, Publish Date - Oct 18 , 2025 | 09:03 AM
మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సినిమా చేస్తారనే వార్త కొన్నేళ్లగా వైరల్ అవుతోంది. 'కుమారి 21 ఎఫ్’ చిత్రం సమయంలో సుకుమార్ చెప్పిన మాట ఇది.
మ్యూజిక్ మిసైల్ దేవిశ్రీ ప్రసాద్ (DSP as Hero) హీరోగా సినిమా చేస్తారనే వార్త కొన్నేళ్లగా వైరల్ అవుతోంది. 'కుమారి 21 ఎఫ్’ చిత్రం సమయంలో సుకుమార్ చెప్పిన మాట ఇది. అలాగే దిల్ రాజు కూడా దేవిని మా బ్యానర్‌లో హీరోగా పరిచయం చేస్తానని చెప్పారు. తాజాగా ఈ విషయంపై ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దేవిశ్రీప్రసాద్ హీరోగా కొత్త జర్నీ ప్రారంభించనున్నారు. ‘బలగం’ ఫేం వేణు ఎల్దండి (Balagam Fame venu) తెరకెక్కించనున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో డీఎస్‌పీ హీరోగా పరిచయం కానున్నారని తెలిసింది.
దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ (keerthy Suresh) నటించనున్నట్టు సమాచారం. దిల్‌రాజు (Dil Raju) సంస్థలో రెండు సినిమాలు చేయడానికి కీర్తి సురేశ్ సైన్ చేసినట్లు తెలిసింది. దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైంది. అందులో హీరోయిన్‌గా కీర్తి నటిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ‘ఎల్లమ్మ’ సినిమాలోనూ ఆమె నటించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
దేవిశ్రీ ప్రసాద్‌ని కథానాయకుడిగా పరిచయం చేయాలని చాలామంది అనుకున్నారు. ఓ సందర్భంలో దిల్ రాజు, మరోసారి సుకుమార్ బలంగా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ దేవి తన మ్యూజిక్‌తోనే బిజీగా ఉండడంతో ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నా ఇటువైపు దృష్టి సారించలేదు. అయితే అప్పుడప్పుడు పాటల్లో కనిపిస్తూ తన కోరిక తీర్చుకునేవాడు. అయితే.. ఎట్టకేలకు ఇప్పుడు సై అన్నట్లు తెలిసింది. ఇటీవల ‘ఎల్లమ్మ’ కథని ఆయన విని కథ నచ్చడంతో అంగీకారం తెలిపినట్లు తెలిసింది. గతంలో ఈచిత్రం కోసం నాని, నితిన్ పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా దేవిశ్రీ ప్రసాద్ వచ్చి చేరారు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.