సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Devara 2: మార్పులు చేర్పులు అందుకేనా..

ABN, Publish Date - Oct 19 , 2025 | 01:45 PM

ఎన్టీఆర్‌ (Jr Ntr) హీరోగా నటించిన ‘దేవర’ (Devara) సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా బాగానే వసూలు చేసింది. ఓటీటీలోనూ చక్కని స్పందనే దక్కించుకుంది.

Devara 2

ఎన్టీఆర్‌ (Jr Ntr) హీరోగా నటించిన ‘దేవర’ (Devara) సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా బాగానే వసూలు చేసింది. ఓటీటీలోనూ చక్కని స్పందనే దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇటీవల దేవర రెండో పార్ట్‌కు (Devara 2) సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఇచ్చారు మేకర్స్‌. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌కు వెళ్లబోతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై  ఓ వార్త వైరల్‌ అవుతోంది.


పలు కారణాల చేత ‘దేవర-2’ కథలో చాలా మార్పులు చేశారట. ముఖ్యంగా ఉత్తరాధి ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వడానికి కావలసిన ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందింది. ఇందులో మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు ఈ సినిమాలో నటిస్తాడని తెలిసింది. అలాగే మరో హీరోయిన్‌ కూడా అలరించనుందని తెలిసింది. ఫస్ట్‌ పార్ట్‌లో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటించారు. గత ఏడాది సెప్టెంబర్‌ 24న ఈ చిత్రం విడుదలైంది.

Updated Date - Oct 19 , 2025 | 01:47 PM