సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Devagudi: టీజర్ ఆవిష్కరించిన శ్రీకాంత్

ABN, Publish Date - Nov 14 , 2025 | 01:16 PM

నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'దేవగుడి' సినిమా టీజర్ ను శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సినిమా డిసెంబర్ 19న విడుదల కాబోతోంది.

Devagudi Movie

బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా 'దేవగుడి' (Devagudi). అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు షేక్ మదీన్, రఘు కుంచె (Raghu Kunche) సంగీతం అందించారు. డిసెంబర్ 19న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీజర్ ను సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఆవిష్కరించారు.

టీజర్ ఆవిష్కరణ అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ, '2013లో రామకృష్ణా రెడ్డి నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే.. మీరే డైరెక్షన్ చేయవచ్చు కదా అని అనేవాడిని. అలానే ఆయన దర్శకుడు అయ్యారు. ఇప్పుడు ఆయన రూపొందించిన 'దేవగుడి' టైటిల్ చాలా బాగుంది. టీజర్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో చిత్రమ్మగారు పాడిన మెలోడీ సాంగ్ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఆ సాంగ్ నా మదిని తాకింది. ఇది ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్‌గా జరిగిన సంఘటనలతో తెరకెక్కిన సినిమా ఇది' అని అన్నారు.


దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ, '2013లో శ్రీకాంత్‌గారితో పుష్యమి ఫిలిం మేకర్స్ సంస్థకు శ్రీకారం చుట్టాము. శ్రీకాంత్‌ గారు ఏ నోటితో అన్నారో ఆ రోజు.. ‘భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అని’.. ఆ తర్వాత నేను డైరెక్టర్‌గా మారాను. ‘దృశ్యకావ్యం’ చేశాను. అప్పుడు కూడా ఆయన అభినందించారు. ఇప్పుడు మళ్లీ మా ‘దేవగుడి’ కోసం వచ్చారు. డిసెంబర్ 19న ‘దేవగుడి’ ఫైర్ ఉంటుంది. కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఎందుకంటే, ఈ సినిమాకు టాలెంటెడ్ పర్సన్స్ ఎందరో వర్క్ చేశారు' అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రఘు కుంచె, డీఓపీ లక్ష్మీకాంత్ కనికే, హీరోహీరోయిన్లు మాట్లాడుతూ సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

Also Read: Kaantha Review: 'కాంత' మూవీ రివ్యూ

Also Read: Saturday TV Movies: శ‌నివారం, Nov 15.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Updated Date - Nov 14 , 2025 | 01:18 PM