సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Andhra King Taluka: 'ఆంధ్రా కింగ్‌ తాలూక’ టాక్‌ పాజిటివ్‌.. కలెక్షన్లు నిల్‌! పెద్ద.. దెబ్బే ఇది

ABN, Publish Date - Dec 01 , 2025 | 10:25 PM

రామ్‌ (Ram Pothineni) హీరోగా మహేశ్‌బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన 'ఆంధ్రా కింగ్‌ తాలూక’ (Andhra king thaluka) చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే!

Ram

రామ్‌ (Ram Pothineni) హీరోగా మహేశ్‌బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన 'ఆంధ్రా కింగ్‌ తాలూక’ (Andhra king thaluka) చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే! టాక్‌, బావుంది, రివ్యూలు, రేటింగ్‌లు బాగానే వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం కనిపించడం లేదని టాక్‌. ఈ సినిమా బడ్జెట్‌ రూ. 65 కోట్లు, కాగా నాలుగు రోజులు వరల్డ్‌ వైడ్‌ షేర్‌ 9 కోట్లు. డిజిటల్‌ రైట్స్‌ 30 కోట్లు అని ప్రచారంలో ఉంది. మిగిలింది థియేట్రికల్‌ బిజినెస్‌. అనుకుంటే తొలివ వారాంతంలో కేవలం 30 శాతమే రికవరీ అయింది. ఇంకా ఏ మేరకు వసూళ్లు రావచ్చు అంటే పోయేదే తప్ప వచ్చేదేమీ లేదని తెలుస్తోంది. ఈ మఽధ్యకాంలో రామ్‌ నటించిన ఏ సినిమా విజయం వైపు కన్ను కూడా వేయలేదు. ఈ చిత్రానికి కాస్ల హైప్‌ వచ్చింది.. బాగా ఆడుతుందనే అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేసి రామ్‌ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా నిలిచింది. హిట్‌ అందుకుందన్న ఆనందం హీరోయిన్‌ భాగ్యశ్రీకి లేకుండా పోయింది. ఫెయిల్యూర్‌ని కంటిన్యూ చేసింది. మరోపక్క ఈ సినిమా రిజల్ట్‌ ఇండస్ర్టీలో ఆసక్తికరమైన చర్చలకు తెరలేపింది.

ఈ సినిమాకు రివ్యూస్‌ రేటింగ్స్‌ పాజిటివ్‌గా ఇచ్చినా, ఇప్పించినా జనాలు మాత్రం వాటిని లెక్క చేయలేదనీ. రివ్యూల ఇంపాక్ట్‌ సినిమాలపై లేదని ప్రేక్షకుల మాట్లాడుకుంటున్నారు. రాబోతున్న సినిమాలు చూసేందుకు డబ్బు ఆదా చేసుకుంటున్నారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈ నెల 5న రాబోతున్న అఖండ! తాండవం ప్రభావం కూడా ఈ సినిమాపై పడే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది.

Updated Date - Dec 02 , 2025 | 06:33 AM