Ghaati: సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన ఘాటీ.. దస్సోర లిరికల్ వీడియో రిలీజ్
ABN , Publish Date - Aug 20 , 2025 | 09:39 PM
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటీ(Ghaati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ ప్రభు (Vikram Prabhu) హీరోగా నటిస్తున్నాడు.
Ghaati: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటీ(Ghaati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ ప్రభు (Vikram Prabhu) హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎన్నో వాయిదాల తరువాత ఘాటీ సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. సినిమా నుంచి వరుస లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు.
తాజాగా ఘాటీ మేకర్స్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను సడెన్ గా రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. దస్సోర..దస్సోర అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఘాటీ.. ఘాటీ.. ఘాటీ అంటూ వచ్చే రైమింగ్ లిరిక్స్ మరింత పవర్ ఫుల్ గా సాగాయి. ఈఎస్ మూర్తి లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను గీత మాధురి, సాకేత్, శృతి రంజని మరింత అద్భుతంగా ఆలపించారు.
ఇక సాంగ్ లో ఘాటీలుగా అనుష్క, విక్రమ్ ప్రభు కనిపించారు. గంజాయిని ఎవరి కంటా కనిపించకుండా నది దాటించేవారిని ఘాటీలు అంటారు. అలా అనుష్క, విక్రమ్ ప్రభు పనిచేస్తూ.. తమపై అధికారం చెలాయించేవారిపై ఎలా మిగతావారిని కాపాడారు.. అనేది ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అనుష్క ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Mahesh Babu: ఇమిగ్రేషన్ కష్టాలు ఇక ఉండవు అంటున్న మహేష్.. ఎలాగో తెలుసా
Akkineni Nagarjuna: నాగార్జున 100 .. పెద్ద సవాలే