Mahesh Babu: ఇమిగ్రేషన్ కష్టాలు ఇక ఉండవు అంటున్న మహేష్.. ఎలాగో తెలుసా

ABN , Publish Date - Aug 20 , 2025 | 10:08 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు ఎక్కువ వాణిజ్య ప్రకటనలలో కనిపించే ఏకైక హీరో మహేష్ బాబు.

Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు ఎక్కువ వాణిజ్య ప్రకటనలలో కనిపించే ఏకైక హీరో మహేష్ బాబు. కేవలం యాడ్స్ లోనే కాకుండా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో కూడా తనవంతు సహాయం చేస్తూ ఉంటాడు. తాజాగా మహేష్ బాబు.. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కొత్త వెబ్ సైట్ గురించి అభిమానులతో పంచుకున్నాడు. సాధారణంగా ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ కు ఎంత సమయం పడుతుందో అందరికీ తెల్సిందే. ముఖ్యంగా ఆ క్యూలో నిలబడడంతోనే సగం టైమ్ అయిపోతుంది.


ఇక నుంచి అలాంటి బాధ లేదు. చిటికెలో ఇమిగ్రేషన్ అయ్యిపోయే విధంగా భారత ప్రభుత్వం కొత్తగా ఒక వెబ్ సైట్ ను లాంచ్ చేసింది. అదే ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టడ్ ట్రావెల్డ్ ప్రోగ్రామ్(FTITTP). ఇందులో ఇండియన్ పాస్ పోర్ట్స్, OCI కార్డు హోల్డర్స్ రిజిస్టర్ చేసుకొని డిజిటల్ గా ఇమిగ్రేషన్ చేసుకోవచ్చు. ఈ గేట్స్ లో తమంతట తామే రిజిస్టర్ చేసుకొని తమ పాస్ పోర్ట్, బయోమెట్రిక్ తో వెరిఫై చేసుకొని డైరెక్ట్ గా లోపలికి వెళ్లిపోవచ్చు. దీనివలన ఎంతో సమయం ఆదా అవుతుంది.


ఇక ఈ ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కూడా రానుంది. ఇక దీనిపై మహేష్ ఆనందం వ్యక్తం చేశాడు. ' హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్‌తో ప్రయాణం ఇంకా సులభం కానుంది' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఈ ప్రమోషన్ కి నువ్వే కరెక్ట్ పర్సన్. నువ్వే ఎక్కువ వెకేషన్స్ కు తిరిగేది. ఇప్పుడు నీకు ఇమిగ్రేషన్ ఇంకా సులభం.. ఇక అస్సలు ఎయిర్ పోర్ట్ లో ఒక్క నిమిషం కూడా ఆగవు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు SSMB29 సినిమాలో నటిస్తున్నాడు.

Updated Date - Aug 20 , 2025 | 10:08 PM