Thota Krishna: అర్చన అమ్మవారి పాత్రలో 'దక్షిణ కాళీ'....

ABN , Publish Date - Nov 24 , 2025 | 05:08 PM

అర్చన ప్రధాన పాత్ర పోషించిన 'దక్షిణ కాళీ' ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాను తోట కృష్ణ దర్శకత్వంలో మీసాల వాణి నిర్మించారు.

Dakshina Kaali Movie Trailer

నటి అర్చన (Archana) అమ్మవారిగా నటిస్తున్న సినిమా 'దక్షిణ కాళీ' (Dakshina Kali). చంద్రగిరి సుబ్బు, ప్రియాంక శ్రీ, చంద్రకళ, ఆఫ్జాద్ అజాద్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తోట కృష్ణ (Thota Krishna) దర్శకత్వంలో మీసాల వాణి (Meesala Vani) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్థమైన ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నటుడు శివాజీ రాజా (Shivaji Raja) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, కార్యవర్గ సభ్యురాలు పద్మిని ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ, 'ఇలాంటి సినిమాలు తీయాలంటే... డబ్బు కాదు దమ్ము కావాలి. ఆ కాళీమాతే మీసాల వాణిని ఆవహించి ఈ సినిమా తీసిందేమో అన్నట్టుంది ఈ సినిమా ట్రైలర్. అలాగే అర్చన ఇందులో అద్భుతంగా నటించింది. హీరో హీరోయిన్స్ చక్కటి నటనను ప్రదర్శించారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు. గతంలో సినిమాలు తీసిన మీసాల రాణి ఇప్పుడు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారని, ఆమెకు ఈ సినిమా కలిసి రావాలని ఆశిస్తున్నానని ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ సినిమాకు మంచి మాటలు రాసే అవకాశం ఇచ్చిన తోట కృష్ణకు దాసరి వెంకట కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ దేవతల గురించి, పోతురాజుల గురించి, గ్రామ పండగల గురించి తెలియచెప్పే ప్రయత్నం 'దక్షిణ కాళీ'తో చేశామని లైన్ ప్రొడ్యూసర్ మీసాల నాగవంశీ (నాని) చెప్పారు. అమ్మవారి దయతోనే తాను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నానని, ఈ సినిమాకు కథను తానే రాశానని, వందమంది అమ్మవార్లు, ఒకే ఒక తమ్ముడు పోతురాజు మీద రాసిన కథ ఇదని ఆమె చెప్పారు. ఇందులో అక్కా తమ్ముళ్ళ అనుబంధం గొప్పగా ఉంటుందని తెలిపారు. తమకు అవకాశం ఇచ్చిన దర్శకుడు తోట కృష్ణకు చంద్రగిరి సుబ్బు, ప్రియాంక, ఆఫ్జాద్ అజాద్, చంద్రకళ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Pathang: యూత్‌ఫెస్టివల్‌లా ‘ప‌తంగ్’

Also Read: Tollywood: నిన్న నర్సయ్య.. నేడు వనజీవి రామయ్య...

Updated Date - Nov 24 , 2025 | 05:18 PM