Pathang: యూత్‌ఫెస్టివల్‌లా ‘ప‌తంగ్’

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:27 PM

ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. డి.సురేష్‌ బాబు సమర్పణలో ఈ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Pathang

ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’ (Pathang). సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి (Praneeth Prattipati)ద‌ర్శ‌కుడు. ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. ఎస్‌.పి.చ‌ర‌ణ్ కీల‌క‌ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. డి.సురేష్‌ బాబు సమర్పణలో ఈ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

నిర్మాతలు మాట్లాడుతూ 'మా సినిమా డి.సురేష్‌బాబు సమర్పణలో రిలీజ్‌ కానుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్త‌వాళ్ల‌తో చేసిన మా  సినిమా కొత్త‌గా వుండ‌టంతో పాటు చాలా    క్వాలిటీ గా  ఉంటుంది. కలర్‌ఫుల్‌గా ఉండే ఈ సినిమాకు క‌థే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు. పాట వింటూంటే అంద‌రిలో పాజిటివ్ వైబ్స్ క‌లుగుతాయి. సినిమా చూస్తున్నంత సేపు ఆ పంతగుల పోటీ మీలో ఉత్సుకతను కలిగిస్తుంది.  అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది' అని తెలిపారు

Updated Date - Nov 24 , 2025 | 04:27 PM