సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Sirish Wedding: అల్లు అర్జున్ బాటలోనే తమ్ముడు.. పెళ్లి డేట్ ప్రకటించిన శిరీష్!

ABN, Publish Date - Dec 29 , 2025 | 01:08 PM

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా శిరీష్ తన పెళ్లి తేదీని ప్రకటించాడు.

Allu Sirish

టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రియురాలు నైనిక రెడ్డి (Nayanika)తో శిరీష్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా శిరీష్ తన పెళ్లి తేదీని ప్రకటించాడు. వచ్చే ఏడాది మార్చి 6న తను వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. చాలా కాలంగా శిరీష్ పెళ్లిపై వస్తున్న గాసిప్స్‌కు తెరదించుతూ, తన సోదరుడు అల్లు అర్జున్ పిల్లలు.. అయాన్ (Allu Ayaan), అర్హ (Allu Arha)లతో కలిసి ఒక క్యూట్ వీడియో ద్వారా తన పెళ్లి వార్తను శిరీష్ పంచుకున్నాడు. వచ్చే ఏడాది మార్చి 6న తను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనతో అల్లు అభిమానులు అందరూ పండగ చేసుకుంటున్నారు.

అయితే, ఈ పెళ్లి తేదీ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం, అంటే 2011 మార్చి 6వ తేదీనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు తమ్ముడు శిరీష్ కూడా సరిగ్గా అదే తేదీని తన పెళ్లి కోసం ఎంచుకోవడం విశేషం. అన్నయ్య అడుగుజాడల్లో నడవడమే కాకుండా, ఆయన పెళ్లి రోజునే తను కూడా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని శిరీష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నైనిక రెడ్డి తెలంగాణ అమ్మాయి. ఈమె పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే అని తెలుస్తుంది. ఆమె తండ్రి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కాగా.. నైనిక కూడా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులో రెండు ఐటీ కంపెనీలను విజయవంతంగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. అందం, తెలివితేటలు కలగలిసిన నైనిక, అల్లు వారి ఇంటి కోడలిగా రాబోతుండటం విశేషం.

ఇక వీరిద్దరి ప్రేమకథ సినిమా స్టోరీని తలపిస్తుంది. అల్లు శిరీష్ సినిమాల్లోకి రాకముందు నుంచే వీరికి పరిచయం ఉందట. ఆ పరిచయం కాస్తా బలమైన స్నేహంగా మారింది. కొన్నాళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట, ఆపై ప్రేమలో పడ్డారట. కొంతకాలం డేటింగ్‌లో ఉన్నాక, తమ బంధాన్ని వివాహంతో మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, అక్టోబర్ లో ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అన్నయ్య పెళ్లి రోజునే తమ్ముడు కూడా ఒక ఇంటివాడు కాబోతుండటంతో.. మార్చి 6 అనేది అల్లు ఫ్యామిలీకి ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోనుంది.

Updated Date - Dec 29 , 2025 | 01:25 PM