Band Melam: 'బ్యాండ్ మేళం'.. స్టార్ట్ చేసిన కోర్ట్ జంట
ABN, Publish Date - Sep 17 , 2025 | 04:10 PM
కోర్టు సినిమాతో అలరించిన రోషన్ (Roshan), శ్రీదేవి (Sridevi) జంట మరోమారు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది.
రెండు నెలల క్రితం నాని నిర్మించిన కోర్టు సినిమాతో అలరించిన రోషన్ (Roshan), శ్రీదేవి (Sridevi) జంట మరోమారు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. వారిరువురు హీరోహీరోయిన్లుగా బ్యాండ్‌మేళం (Band Melam) అనే కొత్త సినిమా ప్రారంభమైంది.
సాయి కుమార్ (Sai Kumar ) కీలక పాత్రలో నటిస్తోండగా విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ రైటర్ కోన వెంకట్ సొంత బ్యానర్‌లో (Kona Film Corporation) ఈ సినిమా నిర్మితమవుతుండగా సతీశ్ జువ్వాజీ (Sathish Javvaji) రచన, దర్శకత్వం చేస్తున్నాడు.
తాజాగా బుధవారం మేకర్స్ ఈ సినిమా గ్లిమ్స్ విడుదల చేశారు. ఈ వీడియో చూస్తే.. తెలంగాణ నేపథ్యంలో బావ మరదల్ల మధ్య జరగే ప్రేమకథ అని అర్థమవుతోంది. గ్లిమ్స్ నేపథ్యంలో వచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం బాగా ఆకట్టుకునేలా ఉంది.