సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bakasura Restaurant: ఇదొక తిండిపోతు కథ

ABN, Publish Date - Aug 06 , 2025 | 02:22 AM

ఇప్పటి వరకూ తెలుగులో చాలా జోనర్‌లు వచ్చాయి. ఈ కొత్త జోనర్‌ను మా సినిమాతోనే ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం.

‘ఇప్పటి వరకూ తెలుగులో చాలా జోనర్‌లు వచ్చాయి. ఈ కొత్త జోనర్‌ను మా సినిమాతోనే ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. ఇదొక తిండిపోతు కథ. హాస్యంతో ప్రేక్షకులను రంజింపజేయడమే మా లక్ష్యం’ అని అన్నారు దర్శకుడు ఎస్‌జే శివ. ఆయన దర్శకత్వంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్దన్‌ ఆచారి నిర్మించారు. సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఎస్‌జే శివ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘ఐదుగురు బ్యాచిలర్స్‌ మధ్య జరిగే కామెడీ కథ ఇది. కథ వినగానే ప్రవీణ్‌ ఈ సినిమాకు కథే హీరో..తప్పకుండా మనం చేద్దాం అన్నారు. ఇంతకు ముందు వచ్చిన ‘ఘటోత్కచుడు’, ‘యమలీల’ చిత్రాల్లా ఆడియన్స్‌ థ్రిల్లింగ్‌గా ఫీలవుతారు. ఈ సినిమాలో హారర్‌ థ్రిల్లర్‌, కామెడీ, ఎమోషన్స్‌ అన్నీ ఉన్నాయి. ఎస్వీసీ లాంటి గొప్ప సంస్థ మా చిత్రాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 02:22 AM