సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rahul Sipligunj: ఘ‌నంగా.. రాహుల్‌ సిప్లిగంజ్ వివాహం! హ‌జ‌రైన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Nov 28 , 2025 | 05:30 AM

టాలీవుడ్‌ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తన ప్రేయసి హరిణ్యరెడ్డితో గురువారం హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. రిసెప్షన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరై జంటను ఆశీర్వదించారు.

Rahul Sipligunj

ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌, అస్కార్ విన్న‌ర్ రాహుల్‌ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఎట్ట‌కేల‌కు ఓ ఇంటివాడయ్యాడు. ఆయన ప్రేయసి హరిణ్యరెడ్డి (Harinya Reddy) తో గురువారం హైదరాబాద్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సన్నిధిలో ఈ వేడుక ఎంతో సందడిగా, ఆహ్లాదకరంగా జరిగింది.

రాహుల్–హరిణ్యరెడ్డి జంట రిసెప్షన్‌ కూడా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనగా, సోషల్‌ మీడియాలో కూడా ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సింగర్‌గా సూపర్‌హిట్‌ పాటలు అందిస్తూ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన రాహుల్‌ సిప్లిగంజ్‌ కొత్త జీవితం ప్రారంభించగా, అభిమానులు ‘హ్యాపీ మ్యారెడ్‌ లైఫ్‌’ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Updated Date - Nov 28 , 2025 | 05:40 AM