సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi - VIjay Polaki: కట్టె కాలే దాకా చిరు అభిమానినే..

ABN, Publish Date - Sep 11 , 2025 | 06:23 PM

మెగాస్టార్‌ చిరంజీవితో పని చేయాలని, ఆర్టిస్ట్‌ల నుంచి దర్శకనిర్మాతల వరకూ క్యూ కడుతుంటారు. అదే డాన్సర్స్‌కి అయితే ఆ ఉత్సాహం రెట్టింపు ఉంటుంది.

మెగాస్టార్‌ చిరంజీవితో (Chiranjeevi) పని చేయాలని, ఆర్టిస్ట్‌ల నుంచి దర్శకనిర్మాతల వరకూ క్యూ కడుతుంటారు. అదే డాన్సర్స్‌కి అయితే ఆ ఉత్సాహం రెట్టింపు ఉంటుంది. అలా చిరంజీవితో పని చేయాలని, ఆయనకు నృత్యరీతుల్ని సమకూర్చాలని ఎదురుచూసే ఓ ఫ్యాన్‌ బాయ్‌ కమ్‌ కొరియోగ్రాఫర్‌ ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ (Man Shankara Varaprasad Garu) (సినిమాతో అతనికి చిరుకి కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చిందని మురిసిపోతున్నారు పొలాకి విజయ్‌ (Vijay polaki) . ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా తెలిపారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. నయనతార కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం దక్కింది. దాంతో ఆయన భావోద్వేగంగా ఓ పోస్ట్‌ చేశారు.

‘చిన్నప్పటి కల..

ఎవరి డ్యాన్స్‌ చూసి పెరిగానో..

ఎవరి స్టెప్స్‌ చూసి డ్యాన్స్‌ మీద ఇష్టం కలిగిందో..

ఎవరి డ్యాన్స్‌ చూసి నేను ఇండస్ర్టీకి వెళ్లాలి అని అనుకున్నానో..

ఎవరి డ్యాన్స్‌ చూసి నాకు ఆయనతో ఒక ఛాన్స్‌ వస్తుందా? అని ఫీలయ్యానో..

అలాంటి డ్యాన్స్‌కు దేవుడైన వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్‌ చిరంజీవి గారికి నేను కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం నాకు దేవుడిచ్చిన పెద్ద బహుమతి.

2025 నా జీవితంలో ఒక పెద్ద సంవత్సరం. ఈ రోజు మా బాస్‌తో పనిచేసే అవకాశం రావడానికి కారణం అనిల్‌ రావిపూడిగారు. సుస్మితగారు, సాహు గారు. మీ సహకారానికి ధన్యవాదాలు. ఇది మర్చిపోలేని బహుమతి. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. సమీర్‌ సర్‌ సహకారానికి కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్క డ్యాన్సర్‌ కల బాస్‌తో కలిసి పనిచేయడం. నాకు అయితే ఇంకా స్పెషల్‌. ఎందుకంటే నాకు ఇష్టమైన హీరో. మా అమ్మానాన్నలకు కూడా ఆయనంటే అభిమానం. వారి ఆశీస్సులు ఉండటం వల్ల నేను ఈరోజు ఆయన వరకూ చేరుకున్నానని భావిస్తున్నా. చిరంజీవి సర్‌ మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కట్టె కాలే వరకూ మీ ఫ్యాన్‌నే’’ అని విజయ్‌ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో వెంకటేశ్‌ గెస్ట్‌గా కనిపించనున్నారు. త్వరలో జరగబోయే షెడ్యూల్‌లో ఆయన ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని ‘అఆఇఈ’ పాటతో కొరియోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. పలాస చిత్రంలో బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ నక్కిలిసు గొలుసు, డబుల్‌ ఇస్మార్ట్‌లో మార్‌ ముంతా చోఢ్‌ చింతా వంటి పాటలకు కొరియోగ్రాఫీ అందించి పేరు తెచ్చుకున్నారు. ‘పుష్ప’తో ఆయనకు మరింత క్రేజ్‌ వచ్చింది. గణేశ్‌ ఆచార్య మాస్టర్‌తో ‘ఊ అంటావా’ పాటకు వర్క్‌ చేసిన ఆయన .. ‘పుష్ప 2’లోని ‘గంగమ్మ తల్లి జాతర’, ‘పుష్ప పుష్ప’ పాటతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.

Updated Date - Sep 11 , 2025 | 06:36 PM