సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhanda 2 Producers: బాలయ్య.. బోయపాటి అనుకుంటే ఏదైనా సాధ్యమే..

ABN, Publish Date - Dec 01 , 2025 | 08:22 PM

శివుడంటే మాస్ కదా.. శివతాండవం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇందులో యాక్షన్ కూడా అలానే ఉంటుంది. ఇందులో త్రిశూలం వాడినట్లుగా మరో సినిమాలో వాడలేరు. ఈ యూనివర్స్ లో మరో సినిమా చేసే స్కోప్ అయితే ఉంది.

'శివుడంటే మాస్ కదా.. శివతాండవం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇందులో యాక్షన్ కూడా అలానే ఉంటుంది. ఇందులో త్రిశూలం వాడినట్లుగా మరో సినిమాలో వాడలేరు. ఈ యూనివర్స్ లో మరో సినిమా చేసే స్కోప్ అయితే ఉంది. అది లిమిట్ లెస్. బాలయ్య గారు బోయపాటి గారు అనుకుంటే ఏదైనా అవ్వచ్చు' అని నిర్మాతలు  రామ్ ఆచంట, గోపీ ఆచంట అన్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను  కలయికలో వస్తున్న చిత్రం  'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు విలేకర్లతో మాట్లాడారు. 


 2014లో మేము తీసిన లెజెండ్ సినిమా ఎలక్షన్స్ కి ముందు ఆ సినిమా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. అదే కాంబినేషన్లో మళ్లీ ఈ ఎలక్షన్స్ కి ముందు ఒక సినిమా చేయాలనుకున్నాం. మేము అనుకున్న కథ సరిగ్గా ఎలక్షన్స్ ముందే రావాలి. అప్పుడే ఆ క్యారెక్టర్, కథ   కనెక్ట్ అవుతుంది. సరిగ్గా ఎలక్షన్ డేట్ అనేది ఒక క్లారిటీ లేకపోవడంతో ఆ కథని పక్కనపెట్టి అఖండ 2 కథని ముందుకు తీసుకెళ్లాం. బాలయ్యతో మళ్ళీ వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది.  బోయపాటి, బాలయ్యది  బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వరసగా హ్యాట్రిక్ విజయాల తర్వాత మళ్లీ వస్తున్న సినిమా ఇది.  ఈ కథ చాలా బిగ్ స్పాన్ ఉన్నది.  అప్పటికి ఇప్పటికీ అదే ఎనర్జీ. ఇంకా పెరిగింది. ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన ఎనర్జీ మనకి వస్తుంది. 

సనాతన ధర్మం చుట్టూ తిరిగే కథ ఇది.  ఇలాంటి సమయంలో ఈ కథ రావడం.. అదే మా సినిమా యుఎస్పి అనుకుంటున్నాం.  అఖండ సినిమాలోనే చిన్న పిల్లలు, దేవాలయాల జోలికి వస్తే ఆ పరమశివుడే వస్తాడని రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ఈ సినిమా ఉంటుంది.  శివుడంటే మాస్ కదా.. శివతాండవం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇందులో యాక్షన్ కూడా అలానే ఉంటుంది. ఇందులో త్రిశూలం వాడినట్లుగా మరో సినిమాలో వాడలేరు. ఈ యూనివర్స్ లో మరో సినిమా చేసే స్కోప్ అయితే ఉంది. అది లిమిట్ లెస్. బాలయ్య గారు బోయపాటి గారు అనుకుంటే ఏదైనా అవ్వచ్చు. ఇందులో మేము మొదలు పెట్టిన కథ అయితే సంపూర్ణంగా పూర్తవుతుంది.

 
-ఈ సినిమాని కుంభమేళాలో షూట్ చేసాం. అక్కడ షూట్ చేయాలంటే చాలా పర్మిషన్స్ కావాలి.  మాకు అన్ని పర్మిషన్లు దొరికాయి. డ్రోన్ పర్మిషన్ కూడా దొరికింది. ఇప్పుడు మీరు సినిమాలో చూడబోయే ప్రతి సన్నివేశం ఈ సినిమా కోసం తీసిందే. స్టాక్ షాట్స్ ని ఉపయోగించలేదు. బోయపాటి గారు అహర్నిశలు కష్టపడి కుంభమేళా సన్నివేశాలని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆది పినిశెట్టి అద్భుతమైన పెర్ఫార్మర్. ఇందులో ఆయన క్యారెక్టర్ చాలా చక్కగా వచ్చింది.  క్యారెక్టర్ కి 200% జస్టిఫికేషన్ చేశారు.

 
ప్రీమియర్స్ కోసం పర్మిషన్స్ లెటర్స్ పెట్టాం. అనుమతులు రాగానే ప్రీమియర్ డేట్స్ అనౌన్స్ చేస్తాం. టికెట్ రేట్స్ రీజనబుల్ గానే ఉంటాయి. ఈ సినిమా కథ గ్లోబల్ గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సినిమాల్లో చాలా గూజ్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. బాలయ్య బోయపాటి గారి నుంచి ఏమి ఆశిస్తారో అంతకు మించి ఉంటుంది.  ఇంకా ఈ సినిమా  త్రీడీలో బాగుంటుందనుకున్నాం. రేపు త్రీడీ సెన్సార్ ఉంటుంది. 2D, 3D రెండూ ఒకేసారి రిలీజ్ ఉంటుంది.


 బోయపాటిలో  ఒక గొప్ప లక్షణం ఉంది. ఆయన ఏది చెప్పినా వింటారు. ఆ కథకి ప్రాజెక్టుకి అవసరమైన సూచన సలహా అయితే వెంటనే నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరణలో పెడతారు. ఇక థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలు కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోరు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది.  


 

Updated Date - Dec 01 , 2025 | 08:25 PM