సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pooja Hegde: ఫెయిల్యూర్స్‌ని అంగీకరించాలి.. లేకపోతే జరిగే నష్టం అదే..

ABN, Publish Date - Jun 08 , 2025 | 02:10 PM

టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. చిన్న సినిమాలతో కెరీర్‌ ప్రారంభించి టాలీవుడ్‌ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోయినా తమిళంలో మాత్రం జోరు చూపిస్తోంది.


టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో పూజా హెగ్డే (Pooja Hegde)ఒకరు. చిన్న సినిమాలతో కెరీర్‌ ప్రారంభించి టాలీవుడ్‌ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోయినా తమిళంలో మాత్రం జోరు చూపిస్తోంది. ఇటీవలే ‘రెట్రో’ (Retro) సినిమాతో తెరపైకి వచ్చిన ఈమె.. త్వరలో విజయ్‌తో కలిసి ‘జన నాయగన్‌’తో పలకరించనుంది.  తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫెయిల్యూర్స్‌ గురించి కెరీర్‌ గురించి మాట్లాడింది.



‘‘ఈ మధ్య కాలంలో నేను నటించిన ‘సర్కస్‌’, ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’, ‘దేవా’ లాంటి చిత్రా?ని బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ కాలేదు. కొన్నేళ్లుగా నా కెరీర్‌లో విజయం అనే పదానికి నిర్వచనమే మారిపోయిందని తెలుసు. కానీ ఈ  టైమ్‌ నాకు చాలా ముఖ్యమైంది. ఇప్పుడు నా రాబోయే సినిమాలు భవిష్యత్తు ప్రాజెక్టులు నేను ఎలాంటి నటిని అనే విషయాన్ని ప్రేక్షకులకు మరోసారి చూపిస్తుందని ఆశిస్తున్నా. చిత్ర పరిశ్రమలో సినిమా నేపథ్యం నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. వారందరూ అవకాశాలను దక్కించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఎన్నో సవాళ్లు, అనుభవాలతో సినీరంగంలో ప్రస్తుతం నేను ఒక స్థాయిలో ఉన్నాను. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది’’.



నేను ఒక ఎంటర్‌టైనర్‌ని..
‘‘ఎంతో ఇష్టపడి చేసిన పాత్ర ప్రేక్షకులకు నచ్చకపోయినా, ఆ సినిమా ఆడకపోయినా ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. విఫలమవ్వడాన్ని కూడా నటులు స్వీకరించాలి. ఒక వేళ దాన్ని అంగీకరించకపోతే.. మేము కొత్తగా ప్రేక్షకులకు ఏమి ఇవ్వలేము. కొన్నిసార్లు అంచనాలు పెట్టుకున్న చిత్రాలే బోల్తా పడతాయి. అలా అని ప్రతీసారి పరాజయమే ఎదురవుతుందని చెప్పలేము.  అందరి జీవితంలో హెచ్చుతగ్గులు కచ్చితంగా ఉంటాయి. అద్భుతమైన చిత్రనిర్మాతలతో కలిసి పని చేయడం.. నటిగా నన్ను ప్రోత్సహించే పాత్రలను ఎంపిక చేసుకోవడం.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడం.. ప్రస్తుతం ఇదే నా లక్ష్యం. నా జర్నీలో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ నేను ఎప్పుడూ విజయాలను మనసులో పెట్టుకోను. ఎందుకంటే వైఫల్యాలు ఎదురైనప్పుడు దాన్ని కూడా మనసులోనే దాచుకోవాలి. అందుకే నేను నటించిన సినిమా హిట్‌ అయినా.. ఫ్లాప్‌ అయిన ఒకేలా ఉంటా. కథలు, పాత్రలు ఎంచుకునే పద్థతిని మార్చి... ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలు పెట్టాలనుకుంటున్నా. నేను ఒక ఎంటర్‌టైనర్‌ని. ఫ్యాన్స్‌ కూడా నా సినిమాల కోసం ఎదురుచూస్తుంటారనే విషయాల్ని దృష్టిలో పెట్టుకోవడం ఎంతో ముఖ్యం.

అది బ్యాడ్‌ న్యూస్‌..

‘‘విజయ్‌ నేను నటించిన ‘బీస్ట్‌’ సినిమా కథ, మ్యూజిక్‌ పరంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు మరోసారి ‘జన నాయగన్‌’లో ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రతిభ గల నటుడు ఆయన. కానీ ఇదే ఆయన చివరి చిత్రం కావడం బాధకరంగా ఉంది. నా దృష్టిలో ఇదొక బ్యాడ్‌ న్యూస్‌.  

Updated Date - Jun 08 , 2025 | 02:10 PM