సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Neeraja Kona: కాస్ట్యూమ్‌ డిజైనర్‌ టు డైరెక్టర్‌.. ఎలాగంటే..

ABN, Publish Date - Oct 07 , 2025 | 07:34 PM

కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కెరీర్‌ ప్రారంభించి ఇప్పుడు డైరెక్టర్‌గా మెగాఫోన్‌ పట్టారు నీరజ కోన(Neeraja Kona). సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఆమె తెరకెక్కించిన చిత్రం ‘తెలుసు కదా’ (Thelusu kada).

Neeraja Kona

కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కెరీర్‌ ప్రారంభించి ఇప్పుడు డైరెక్టర్‌గా మెగాఫోన్‌ పట్టారు నీరజ కోన(Neeraja Kona). సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఆమె తెరకెక్కించిన చిత్రం ‘తెలుసు కదా’ (Thelusu kada). శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా కథానాయికలు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. ఈ నెల 17న గ్రాండ్‌ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ నీరజ కోన విలేకర్లతో మాట్లాడారు.

అదే నా ఎక్స్పీరియన్స్‌, లెర్నింగ్‌ స్కూల్‌

నాకు స్కూల్‌ డేస్‌ నుంచి రైటింగ్‌ ఇష్టం. పోయెట్రీలో ఒక పుస్తకం కూడా పబ్లిష్‌ చేశా. కథఉ చెప్పమంటే చాలా ఇష్టం. నాని ఇలాంటి స్నేహితులు చాలా సపోర్ట్‌ చేశారు. ఒక దశలో సినిమాకి కథ రాయగలను అనే  నమ్మకం కుదిరింది. అలా రాసుకున్న కథల్లో తెలుసు కదా ఒకటి. అయితే డైరెక్ట్‌గా మెగా ఫోన్‌ పట్టేశానే. ఏ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయలేదు. దాదాపుగా వంద సినిమాలకి కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేశాను. 12  ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. అదే నా ఎక్స్పీరియన్స్‌, లెర్నింగ్‌ స్కూల్‌. పులి మేక ట్రైలర్‌ ఈవెంట్‌లో నితిన్‌ని కలిసి ఈ ఐడియా చెప్పా. సిద్దు అయితే ఈ కథకు సూట్‌ అవుతాడని సలహా ఇచ్చారు. అప్పుడు సిద్ధూకి కథ చెప్పా సింగిల్‌ సిట్టింగ్‌లో కథ చెప్పేశా. తర్వాత ఆయన మేనేజర్‌ కాల్‌ చేసి ఈ కథ చేస్తున్నామని చెప్పారు. నా జీవితంలో మర్చిపోలేని మూమెంట్‌. రచయితగా, దర్శకురాలిగా ఈ సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది.


హానెస్ట్‌గా చెప్పడంపైనే
ఇద్దరి మధ్య సాగే ప్రేమకథ ఇది. ప్రేమకథతోపాటు, కాంప్లెక్స్‌ సిటీ కూడా వుంది. ఇది క్యారెక్టర్‌ డ్రివెన్‌ స్టోరీ. ఇందులో మూడు క్యారెక్టర్స్‌ కూడా చాలా బలంగా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌  హానెస్ట్‌, ఎమోషనల్‌గా ఉంటుంది. ఒక కథ అమ్మాయి రాసిందా అబ్బాయి రాసిందా అనే దానికంటే బాగా రాశారు అన్నదే ఇంపార్టెంట్‌. నా దృష్టి కూడా కథని హానెస్ట్‌గా చెప్పడంపైనే ఉంది. ఈ కథ ఎలాంటి బయోస్‌ లేకుండా రాశా. ఈ సినిమాని అబ్బాయి తీశారా అమ్మాయి తీశారా అన్నదానికంటే ఒక గుడ్‌ ఫిలిం మేకర్‌ తీసిన సినిమా అని పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం.

ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమే!
కెరీర్లో ఐకానిక్‌ క్యారెక్టర్‌ దొరకడం అనేది ఒక అదృష్టం. ఎన్ని సినిమాలు చేసిన కొందరికి ఐకానిక్‌ రోల్‌ దొరకదు. కానీ సిద్దూకి టిల్లు లాంటి మంచి క్యారెక్టర్‌ దొరికింది. నిజానికి అలాంటి ఇమేజ్‌ ఉన్నప్పుడు ఒక కొత్త క్యారెక్టర్‌ చేయడం ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమే! కానీ ఇందులో వరుణ్‌ క్యారెక్టర్‌ ఆయన చాలా యూనిక్‌గా ప్రజెంట్‌ చేశారు. ఒక ఫిలిం మేకర్‌గా నేను ఏమి అనుకుంటున్నానో ఆ క్యారెక్టర్‌ని సిద్థులో చూశాను. సిద్దు మంచి నటుడు, స్టోరీ టెల్లర్‌, వరుణ్‌ క్యారెక్టర్‌లో మెస్మరైజ్‌ చేశారు. తన లుక్కు మేనరిజం అన్నిటి పరంగా చాలా స్ర్టాంగ్‌ ప్రజెన్స్‌ క్యారెక్టర్‌ అవుతుంది.

నేర్చుకోవడం ఇష్టం..

కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా బాద్‌షా నా మొదటి సినిమా. అసిస్టెంట్‌గా  కెరియర్‌ మొదలుపెట్టా. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘రామయ్య వస్తావయ్య’ వంటి చిత్రాలకు పని చేశా. తమిళంలో విజయ్‌, కార్తీక్‌, సూర్య, విక్రమ్‌, శివ కార్తికేయన్‌ ఇలా స్టార్స్‌ అందరితో పని చేశా. నాకు నేర్చుకోవడం ఇష్టం. ఈ జర్నీలో ఎంతో మంది గొప్ప టెక్నిషియన్స్‌తో వర్క్‌ చేశాను. ఇవన్నీ నాకు నేర్చుకోవడానికి, ఫిల్మ్‌ మేకర్‌ కావడానికి ఎంతగానో సహాయపడ్డాయి. శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వారి అనుభవం కూడా నాకు సహాయపడింది. తమన్‌ మ్యూజిక్‌ సినిమాకు బ్యాక్‌ బోన్‌. దీని తర్వాత హార్డ్‌ హిట్టింగ్‌ లవ్‌ స్టొరీ చేయబోతున్నా. 

Updated Date - Oct 07 , 2025 | 07:36 PM