సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nara Rohith: ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు.. 

ABN, Publish Date - Aug 25 , 2025 | 08:04 PM

  'నాకు రొమాంటిక్ కామెడీ, స్పోర్ట్స్ డ్రామాలంటే ఇష్టం. మంచి స్పోర్ట్స్ డ్రామా, ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తాను' అని నారా రోహిత్ అన్నారు.

 
'నాకు రొమాంటిక్ కామెడీ, స్పోర్ట్స్ డ్రామాలంటే ఇష్టం. మంచి స్పోర్ట్స్ డ్రామా, ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తాను' అని నారా రోహిత్ (Nara Rohith) అన్నారు. అయన హీరోగా నటించిన చిత్రం 'సుందరకాండ' (Sundarakanda). వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ విలేకరులతో మాట్లాడారు. 

సుందరకాండ నా కం బ్యాక్ సినిమా అనుకోవాలి. 2022 లోనే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాము. డైరెక్టర్ వెంకటేష్ ఈ ఐడియా చెప్పినప్పుడు కంగారు పడ్డాను. ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అనిపించింది. ఐతే అదే సమయంలో వచ్చిన బ్రో డాడీ సినిమా ఒక విండో ఓపెన్ చేసింది. ఆక్వాడ్ గా ఉండే పాయింట్ అందంగా డీల్  చేసిన సినిమా అది. ఆ స్టైల్ లో చేస్తే వర్క్ అవుతుందనిపించింది. వెంకటేష్ ఒక 30 సీన్స్ రాసుకుని వచ్చాడు. నాకు చాలా నచ్చాయి. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ ఫేస్ లో ఒక స్మైల్ ఉంటుంది. లైటర్ వెన్ లో చాలా లైవ్లీగా మంచి ఫన్ తో ఉంటుంది. 

వెంకటేష్ నాతో ఐదేళ్లుగా ట్రావెల్ అవుతున్నాడు. మేము ఈ సినిమా కోసం చాలా డిస్కస్ చేశాము. అవన్నీ కూడా మాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఈ జనరేషన్ కి ఇది చాలా కొత్త కథ. క్యారెక్టర్ లో కొత్త ఎగ్జిట్ ఉంది. ఈ క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేశాను. సుందరకాండ చాలా క్లీన్ ఫిలిం. సీన్స్ ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. క్యారెక్టర్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. 30 దాటినా కూడా కావలసిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతకడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఆ కాంప్లికేషన్ నుంచే ఫన్ క్రియేట్ అవుతుంది. 



ఈ ప్రేమ కథలో ఉన్న కాన్ఫ్లిక్ట్  ఇప్పుడే చెప్పలేను. ఇందులో హీరో కావలసిన ఫైవ్ క్వాలిటీస్ అనేవి చాలా పెక్యులర్. అవి మీరు స్క్రీన్ మీద చూడాలి. ఇందులో హీరో పడే సిచువేషన్ నుంచి సినిమా కామెడీ జనరేట్ అవుతుంది. ఈ సినిమా నా ప్రొడక్షన్ లోనే  స్టార్ట్ చేశాను. సంతోష్ నా కజిన్. తను ఎప్పటి నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు జాయిన్ అయ్యారు. గౌతమ్ రాకేష్.. వెంకీ చెప్పిన కథ నచ్చి జాయిన్ అయ్యారు. స్టోరీ కారణంగానే నలుగురం జాయిన్ అయ్యాం.


ఇందులో సిరి క్యామియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తను నా లక్కీ చార్మ్ అనుకుంటున్నాను. భైరవం డీసెంట్ హిట్. ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది. లియాన్ జేమ్స్ వండర్ఫుల్ పర్సన్. టెరిఫిక్ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత పాటలు మరింత కనెక్ట్ అవుతాయి. ఇందులో డియర్ ఐరా నా ఫేవరెట్ సాంగ్. నాకు రొమాంటిక్ కామెడీస్, అలాగే స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టం. మంచి స్పోర్ట్స్ డ్రామా, ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. వెంకటేష్ తోనే మరో సినిమా చేయాలనుకుంటున్నా. దీనికి ముందు ఒక కథ రాసుకున్నాము. అది కచ్చితంగా చేయాలి. మంచి లవ్ స్టోరీ.  

Updated Date - Aug 25 , 2025 | 08:04 PM