Krish - Ghaati: నా కథలన్నీ అడ్వెంచర్స్‌లానే ఉంటాయి..
ABN, Publish Date - Sep 02 , 2025 | 05:46 PM
ఈ కథ హీరోయిన్ ఓరియెంటెడ్‌గానే పుట్టింది. వేదం తర్వాత స్వీటీతో మరో సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. సరోజ చాలా గొప్ప పాత్ర. ఆ పాత్రను కొనసాగించాలనే ఆలోచన కూడా ఉంది. అయితే ఆర్గానిక్‌గా ఉండే ఒక కథ కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఘాటి వచ్చింది
అనుష్క (Anushka) కథానాయికగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘ఘాటి’ (Ghaati). విక్రమ్ ప్రభు (Vikram Prabhu) కీలక పాత్ర పోషించారు. క్రిష్ జాగర్లమూడి (Krish) దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంలో క్రిష్ విలేకర్లతో మాట్లాడారు.
‘నేను రాసే ప్రతి సినిమా ఒక అడ్వెంచర్ లాంటిదే. ఘాటి విషయానికొేస్త డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గొప్ప రచయిత. ఆయన రచనలు అద్భుతంగా ఉంటాయి. మా కంపెనీలో ‘అరేబియన్ కడలి’ వెబ్ సిరీస్‌కి కథ మాటలు రాశారు. వేరే కథల గురించి చర్చించుకున్నప్పుడు ఘాటి ఆలోచన చెప్పారు. ఆంధ్రా, ఒడిస్సా బోర్డర్‌లో శిలావతి గాంజా రకం పెరుగుతుంది. దానికోసం ఒక వ్యవస్థ పని చేస్తుంటుంది. వాటిని మోయడానికి కొంతమంది కూలీలు ఉంటారు. వారిని ఘాటీలు పిలుస్తారు. ఆ నేపథ్యంలో కథ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. 30 పేజీల కథగా రాశారు. దాన్ని డెవ?ప్ చేయడం మొదలుపెట్టాను. లొకేషన్ కోసం తూర్పు కనుమలకు వెళ్లాను. అదంతా ఒక కొత్త ప్రపంచం. జీవన శైలి అంతా కొత్తగా ఉంది. ఒక కొత్త ప్రపంచం, కల్చర్ ని చూపించే ఆస్కరం వుండటంతో ఘాటీ మొదలుపెట్టాం.
ఈ కథ హీరోయిన్ ఓరియెంటెడ్‌గానే పుట్టింది. వేదం తర్వాత స్వీటీతో మరో సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. సరోజ చాలా గొప్ప పాత్ర. ఆ పాత్రను కొనసాగించాలనే ఆలోచన కూడా ఉంది. అయితే ఆర్గానిక్‌గా ఉండే ఒక కథ కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఘాటి వచ్చింది. ఇందులో శీలావతి క్యారెక్టర్ అనుష్క గారి గ్రేస్, యాటిట్యూడ్, సూపర్ స్టార్‌డమ్‌కి పర్ఫెక్ట్ యాప్ట్. ఈ కథ పూర్తిగా ఫిక్షనల్. గంజాయి అనేది ఒక సోషల్ ఇష్యూ. ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవన్నీ దాటి గంజాయి అనేది సమాజంలోకి వస్తుంది. సర్వైవల్ కోసం చేసినా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐడెంటిటీ, సర్వైవల్ థీమ్స్‌తో వస్తున్న సినిమా ఇది. సోషల్ ఇష్యూ మీద ప్రభుత్వాలే కాదు పౌరులూ పోరాడాలి. ఈ సినిమా కమర్షియల్ యాక్షన్‌తో అనుష్క కోసం చేసిన ఒక బిగ్ స్కేల్ సినిమా. మనందరం ఎదుర్కొంటున్న ఒక సమస్య నిర్మూలనకి ఊతమిస్తుంది కానీ గ్లోరీఫై చేేసలా ఉండదు. అలాగే చాలా కాంప్లెక్స్ స్టోరీ. తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ కథని చాలా అందంగా, సినిమాటిక్‌గా అన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పాం. ఈ కథని యాక్షన్‌తో చెబితేనే ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి. చాలా తీవ్రమైన పాత్రలు, చాలా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆ ఎమోషన్ కనిపిస్తుంది. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్, లొకేషన్స్ పరంగా లార్జెస్ట్ కాన్వాస్ ఉన్న సినిమా ఇది.
దేశిరాజు క్యారెక్టర్‌ని రాస్తున్నప్పుడే విక్రమ్ ప్రభుని ఊహించుకున్నాను. ఆయన ఫిల్మోగ్రఫీ అంతా చూశాను. ఈ క్యారెక్టర్‌కి ఆయన కరెక్ట్ అనిపించింది. దేశి రాజు చాలా స్వచ్ఛమైన క్యారెక్టర్. ఒక సమూహానికి నాయకుడు లాంటి పాత్ర.. అద్భుతంగా నటించారు. ఇందులో కుందుల నాయుడు అనే మరో క్యారెక్టర్ ఉంది. చైతన్యరావు చేసిన 30 వెడ్స్ 20 వెబ్ సిరీస్ చూశాను. అలాంటి క్యారెక్టర్ ఒక విలన్ రోల్ చేేస్త కొత్తగా ఉంటుంది. ఆయనకి కథ చెప్తున్నప్పుడే ఆ క్యారెక్టర్ లో బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. నేను కోరుకుంటున్నా క్యారెక్టర్ స్పార్క్ ఆయనలో కనిపించింది. ట్రెలర్‌లో మీరు చూసింది జస్ట్ ఓ రెండు మెతుకులు మాత్రమే. పూర్తి విందు భోజనం సినిమాలో ఉంటుంది. ఇక సినిమాటోగ్రఫీ, సంగీతం అన్ని ఈ చిత్రానికి బోసన్ అనే చెప్పాలి. సాయి మాధవ్ బుర్రా మాటలు సినిమాకు ఎసెట్ అవుతాయి. ఘాటిలో మాటలు ప్రేక్షకుల మనసుని సూటిగా తాకుతాయి.
అనుష్క గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె ఎలాంటి పాత్రలకైనా న్యాయం చేయగలదు. ఆమె బలం ఏంటో మనందరికీ తెలుసు. స్వీటీ సినిమా బాగుంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో చాలా సినిమాలు నిరూపించాయి. అరుంధతి నుంచి భాగమతి వరకు ఎన్నో ఐకానిక్ హిట్స్ ఇచ్చారు. ఘాటిలో తనకి చాలా ఎగ్జైటింగ్ క్యారెక్టర్ దొరికింది. కొత్త ప్రాజెక్ట్‌ల గురించి త్వరలో చెబుతా.