సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bhagyashri Borse: వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ అనిపించుకోవాలి

ABN, Publish Date - Nov 20 , 2025 | 08:57 PM

‘నాకోసం ఎలాంటి కథలు రాసిపెట్టి ఉన్నాయో నాకు తెలియదు. వచ్చిన ప్రతి క్యారెక్టర్‌కి 100శాతం న్యాయం చేసేలా పని చేస్తా.

‘నాకోసం ఎలాంటి కథలు రాసిపెట్టి ఉన్నాయో నాకు తెలియదు. వచ్చిన ప్రతి క్యారెక్టర్‌కి 100శాతం న్యాయం చేసేలా పని చేస్తా. వెర్సటైల్‌ యాక్ర్టెస్‌గా పేరు తెచ్చుకోవాలని కోరిక. ‘అరుంధతీ’లో అనుష్క చేసిన తరహా పాత్రలంటే ఇష్టం. అలాంటి పాత్రలు నాకూ వస్తాయని ఆశిస్తున్నా’ అని భాగ్యశ్రీ భోర్సే అన్నారు.

రామ్‌ పోతినేని హీరోగా నటించిన ‘ఆంధ్రా కింగ్‌ తాలుకా’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలోమహేష్‌ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే విలేకర్లతో మాట్లాడారు.

గుర్తు పెట్టుకునే పాత్ర..

ఈ సినిమాలో మహాలక్ష్మి క్యారెక్టర్‌లో కనిపిస్తాను. కాలేజ్‌ గోయింగ్‌ గర్ల్‌. సాగర్‌తో ప్రేమలో ఉంటుంది. అంతకుమించి ఇప్పుడు ఎక్కువ క్యారెక్టర్‌ గురించి రివీల్‌ చేయకూడదు. కథకు ఈ పాత్ర చాలా ఇంపార్టెంట్‌ అదేంటి అనేది తెరపైనే చూడాలి. నా పాత్రను ఆడియన్స్‌ తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. ఇందులో ప్రేమ కథ చాలా స్వచ్చంగా ఉంటుంది. లవ్‌ స్టొరీ, డైలాగ్స్‌ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. రామ్‌తో పనిచేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. అతని ఎనర్జీకి మ్యాచ్‌ చేశానని అనుకుంటున్నాను.



క్రియేటివ్‌ స్పేస్‌ ఇచ్చారు..  

ఈ సినిమా ఓ ఇంపార్టెంట్‌ సీన్‌ను దర్శకుడు వివరించారు. ఆ సన్నివేశాన్ని నేను ఎలా అనుకుంటున్నానో చేసి చూపిస్తానని దర్శకుడిని రిక్వెస్ట్‌ చేశా. నేను చేసింది అందరికీ నచ్చింది. అంత క్రియేటివ్‌ స్పేస్‌ ఇవ్వడం ఆనందం కలిగించింది. నిర్మాత సంస్థ కూడా అంతే స్పేస్‌ ఇచ్చింది. కాంప్రమైజ్‌ కాకుండా సినిమా తీశారు. ఈ సినిమాలో తులసీ, రావు రమేశ్‌, మురళి శర్మ వంటి అద్భుతమైన ఆర్టిస్ట్‌లతో పని చేశా. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఉపేంద్రగారితో నాకు ఒక్క సీనే ఉంది. ఆయన వెరీ హంబుల్‌, డౌట్‌ టు ఎర్త్‌ యాక్టర్‌. ఆయనతో వర్క్‌ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

ఆన్సర్‌ దొరికింది..

అభిమానం అనేది డివైన్‌ ఎమోషన్‌. నేను నార్త్‌ నుంచి సౌత్‌ కొచ్చినప్పుడు ఇక్కడ ప్రేక్షకులు చూపించిన అభిమానానికి ఒక స్టార్‌ని ఇంతగా అభిమానిస్తారా అన్నది ప్రత్యక్షంగా చూశా. చాలా గొప్ప ఎమోషన్‌ అది. ఎలాంటి రిలేషన్‌ లేకుండా పరిచయం లేకుండా ఒక వ్యక్తిని అంతలా ఎలా అభిమానిస్తారని ఆశ్చర్యపోయా. మహేశ్‌ ఈ కథ చెప్పిన తర్వాత అభిమానం అన్నదానికి ఆన్సర్‌ దొరికింది. రెండు సినిమాలకే మంచి పేరు, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఆర్టిస్ట్‌కు మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది.  అందరూ తమ అమ్మాయిగా అభిమానాన్ని చూపించారు. ఆ అభిమానం మరింత పొందాలని కోరుకుంటున్నా

Updated Date - Nov 20 , 2025 | 09:14 PM