Aadi Sai kumar: నాకు హిట్టు.. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పక్కా
ABN, Publish Date - Dec 24 , 2025 | 08:38 AM
'డిసెంబర్ 25 విడుదల అయ్యే సినిమాల మధ్య గట్టి పోటీ ఉంది. అన్ని సినిమాలు బాగా ఆడాలి. అయితే మేము ఈ డేట్ వదులుకుంటే మళ్లీ ఇంత మంచి డేట్ దగ్గర్లో కనిపించలేదు.
'డిసెంబర్ 25 విడుదల అయ్యే సినిమాల మధ్య గట్టి పోటీ ఉంది. అన్ని సినిమాలు బాగా ఆడాలి. అయితే మేము ఈ డేట్ వదులుకుంటే మళ్లీ ఇంత మంచి డేట్ దగ్గర్లో కనిపించలేదు. అందుకే పోటీ ఉన్న సినిమాపై ఉన్న నమ్మకంతో విడుదల చేస్తున్నాం' అని ఆది సాయి కుమార్ అన్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శంబాల’. ఎ మిస్టికల్ వరల్డ్ అనేది ట్యాగ్ లైన్. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్నభిమొజు, మహీధర్ రెడ్డి కలిసి షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 23న ఆది సాయి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు.
ఇందులో ఓ జియాలజిస్ట్ పాత్రని పోషిస్తున్నా. ఒక ఉల్క వచ్చి ఓ గ్రామంలో పడితే, దాని గురించి పరిశోధన చేయడానికి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నన్ను శంబాల అనే ఊరికి పంపిస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది తెరపై చూసి తెలుసుకోవల్సిందే. 1980 దశకం నేపథ్యంలో సాగే కథ ఇది. టైటిల్ చెప్పినప్పుడే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ కథ విన్న కొన్ని రోజులకే ‘కల్కి’ రిలీజ్ అయింది. ఇందులో అద్భుతమైన పోరాట సన్నివేశాలున్నాయి. రాజ్ కుమార్ మాస్టర్ అన్ని యాక్షన్ సీక్వెన్స్‌కి రిహార్సల్స్ చేశారు. దర్శకుడు యుగంధర్‌తో పాటుగా రాజ్ కుమార్ ట్రావెల్ చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. 80వ దశకంలో వచ్చే కథ కాబట్టి.. లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అవుట్ ఫుట్ బాగా వచ్చింది. నాకు హిట్టు.. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పక్కా.
అదరహో అనేలా మ్యూజిక్..
‘శంబాల’ ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండవు. కానీ ఉన్న వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకున్నాం. శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ చూసి అందరం షాక్ అయ్యాం. ఆర్ఆర్‌తో ఈ మూవీ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. ప్రతీ ఒక్క పాత్రకి ఆయన అద్భుతమైన థీమ్ సెట్ చేశారు. ప్రమోషనల్ సాంగ్ అని అనుకున్నాం. కానీ మాకు అంత టైం లేదు. ఇలాంటి జానర్ చిత్రాలకు హుక్ స్టెప్స్, సాంగ్స్ సెట్ అవ్వవేమో.
పోటీ ఉంది.. నమ్మకము ఉంది..
దర్శకుడు యుగంధర్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంటుంది. ఆయన మొదటి చిత్రం నాకు చాలా ఇష్టం. చెప్పిన కథను తెరపై చూపించారు. నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో సినిమా నిర్మించారు. నా మార్కెట్ కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టారు. హిందీలోనూ మా మూవీని ప్లాన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ముందుగా రిలీజ్ చేస్తున్నాం. ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ బయటకు వెళ్తే.. డే వన్ నుంచే పికప్ అవుతుంది.. 'శంబాల’ని ఆడియెన్స్ హిట్ చేస్తే.. పార్ట్ 2 ప్లాన్ చేస్తాం (నవ్వుతూ).
ప్రస్తుతం ఈటీవీ విన్‌కి సబ్ ఇన్ స్పెక్టర్ యుగంధర్ చేశాను. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తాం.