Mana Shankara Varaprasad gaaru: చిరు - వెంకీ.. ఆ జ్ఞాపకాలను మర్చిపోలేరట
ABN, Publish Date - Dec 03 , 2025 | 09:58 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు (Mana Shankara Varaprasad gaaru). ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటితో కలిసి సుస్మిత కొణిదల నిర్మిస్తుంది.
Mana Shankara Varaprasad gaaru: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు (Mana Shankara Varaprasad gaaru). ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటితో కలిసి సుస్మిత కొణిదల నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, మీసాల పిల్ల సాంగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అనిల్.. ఈసారి సంక్రాంతికి MSVPG తో అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించడం స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తుండడంతో అభిమానులు ఈ సినిమాపై అంచనాలను పెంచేసుకున్నారు. వెంకీ కేవలం క్యామియో మాత్రమే కాదు.. ఒక సాంగ్ లో చిరుతో పాటు స్టెప్స్ కూడా వేశాడు. ఈ మధ్యనే మెగా - విక్టరీ మాస్ సాంగ్ షూట్ ను మొదలుపెట్టి నేటితో ముగించారు. ఇక్కడితో వెంకీ షూటింగ్ ముగిసింది అని సమాచారం. దీంతో వెంకీ.. చిరుకు, అనిల్ కి ధన్యవాదాలు తెలిపాడు.
'మనశంకరవరప్రసాద్ గారు సినిమాలో నా పాత్ర షూటింగ్ ఈరోజుతో ముగిసింది. ఇది అద్భుతమైన అనుభవం! నాకు ఇష్టమైన చిరంజీవితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు చాలా అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం చాలా కాలంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. చివరకు మమ్మల్ని ఇలా ఒకచోట చేరేలా చేసిన అనిల్ కి థాంక్స్. 2026 సంక్రాంతిని మీ అందరితో థియేటర్లలో జరుపుకోవడానికి వేచి ఉండలేకపోతున్నాను' అంటూ రాసుకొచ్చాడు.
ఇక వెంకీ పోస్ట్ కు చిరు స్పందించాడు. ' మై డియర్ బ్రదర్ వెంకీ.. మనం పనిచేసిన ఈ పదిరోజులు ఎంతో అద్భుతమైనవి. మాతో కలిసి పనిచేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రజెన్స్ నాకు ఎనర్జీని, సంతోషాన్ని తీసుకొచ్చి పెట్టింది. మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు మీరు స్పెషల్ టచ్ ని ఇచ్చారు. నేను ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.