Chiranjeevi: పాటతో ముగించారు

ABN , Publish Date - Jul 26 , 2025 | 02:28 AM

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సోషియో ఫాంటసీ విజువల్‌.

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సోషియో ఫాంటసీ విజువల్‌ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి వశిష్ట దర్శకుడు. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మాతలు. ఇప్పటికే ఒక పాట మినహా ఈ చిత్రం పూర్తయింది. చిరంజీవి, మౌని రాయ్‌పై చిత్రీకరించిన అద్భుతమైన డ్యాన్స్‌ నంబర్‌తో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు. అయితే యువ సంగీత సంచలనం భీమ్స్‌ సిసిరోలియో తాజా పాటకు స్వరకల్పన చేయడం విశేషం. శ్యామ్‌ కాసర్ల రాసిన ఈ పాట అభిమానులకు ఒక ట్రీట్‌గా ఉంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. గణేశ్‌ ఆచార్య నృత్య దర్శకత్వంలో వంద మంది డ్యాన్సర్స్‌ కూడా పాల్గొనగా ఈ పాటను గ్రాండ్‌గా తీశారు. మెగాస్టార్‌ చిరంజీవి తన సిగ్నేచర్‌ గ్రేస్‌తో అదరగొట్టేశారు. త్రిష కథానాయిక. ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు.


Pawan Kalyan: ఫ్యాన్స్ ను ఇలా రెచ్చగొట్టడం నీకు తగునా పవన్

Nara Rohit: పుట్టిన రోజు సందర్భంగా 'సుందర కాండ' రిలీజ్ డేట్

Updated Date - Jul 26 , 2025 | 02:28 AM