సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi - OG Review: మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్‌..

ABN, Publish Date - Sep 30 , 2025 | 01:17 PM

మెగా కుటుంబ సభ్యులంతా పవన్‌ కల్యాణ్‌ నటించిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘ఓజీ’ (OG movie) సినిమాను వీక్షించిన సంగతి తెలిసిందే!

Chiranjeevi at OG show

మెగా కుటుంబ సభ్యులంతా (Mega Family) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘ఓజీ’ (OG movie) సినిమాను వీక్షించిన సంగతి తెలిసిందే! సోమవారం రాత్రి ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. చిరంజీవి, రామ్‌చరణ్‌ సహా కుటుంబ సభ్యులంతా ఈ సినిమా చూశారు. ఈ సినిమాపై చిరంజీవి రివ్యూ ఇచ్చారు. ఈ మేరక్‌ చిరంజీవి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

‘నా కుటుంబంతో కలిసి తమ్ముడు పవన్‌ నటించిన ఓజీ చూశాను. చిత్రంలోని ప్రతి అంశాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. యాక్షన్‌తోపాటు భావోద్వేగాలకు లోటులేకుండా రూపొందించారు. ప్రారంభ సన్నివేశం నుంచి క్లైమాక్స్‌ వరకూ ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు సుజీత్‌ అసాధారణరీతిలో తెరకెక్కించారు. హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌కు తగినట్లు సినిమాను అద్భుతంగా నిర్మించారు.

పవన్‌ కల్యాణ్‌ను తెరపై ఇలా చూడడం చాలా గర్వంగా అనిపించింది. తన ప్రత్యేక ఆకర్షణతో సినిమాను నిలబెట్టాడు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న అభిమానులకు ‘ఓజీ’తో సరైన విందు ఇచ్చాడు. సంగీత దర్శకుడు తమన్‌ ప్రాణంపెట్టి పని చేశాడు. అతని పనితీరు ఈ చిత్రానికి ఆత్మతో సమానం. సినిమాటోగ్రఫీ వర్క్‌ కూడా అద్భుతంగా ఉంది. సుజీత్‌, దానయ్య సహా టీమ్‌ అందరికీ పేరుపేరున నా అభినందనలు’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 01:17 PM