సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి: చిరంజీవి

ABN, Publish Date - Jun 23 , 2025 | 04:32 AM

కుబేర లాంటి సినిమాలు మరిన్ని రావాలి. ఎందుకంటే సినిమా సక్సెస్‌ అవ్వడమే గగనమైపోతున్న రోజులివి. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం చాలా కష్టమవుతోంది. భారీ బడ్జెట్‌ సినిమాలు..

‘‘కుబేర’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి. ఎందుకంటే సినిమా సక్సెస్‌ అవ్వడమే గగనమైపోతున్న రోజులివి. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం చాలా కష్టమవుతోంది. భారీ బడ్జెట్‌ సినిమాలు.. పెద్ద హీరోల సినిమాలు ఆడుతుండొచ్చు. కానీ మంచి కంటెంట్‌తో విభిన్నంగా ఉండే ఇలాంటి సినిమాలు ఆడితేనే కొత్త ప్రయత్నాలు చేయడానికి ధైర్యం వస్తుంది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలను చూడడానికి థియేటర్లకు ప్రేక్షకులు వస్తారు’’ అని అన్నారు చిరంజీవి. నాగార్జున, ధనుష్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేర’ చిత్రం సక్సెస్‌ మీట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఇది నా సినిమా సక్సెస్‌ మీట్‌లా అనిపిస్తోంది. శేఖర్‌ కమ్ముల సినిమాల్లో పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా మరోసారి ధను్‌షకు జాతీయ అవార్డు దక్కాలి’’ అని ఆకాంక్షించారు. నాగార్జున మాట్లాడుతూ ‘‘మంచి రివ్యూలు వచ్చినా.. కలెక్షన్లు రావు. కానీ ఈ చిత్రానికి రెండూ వస్తుండడం అద్భుతమైన విషయం.’’ అని చెప్పారు. ధనుష్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ‘దేవా’ పాత్ర కోసం పడిన కష్టమంతా మరిచిపోయాను’ అని తెలిపారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నాకు సవాలు విసిరిన సినిమా ఇది. ఈ సక్సెస్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇంతటి ఘనవిజయాన్నిచ్చిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను’’ అని అన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 04:34 AM