సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi: వేలమంది కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకోవడం తట్టుకోలేకపోయాం..

ABN, Publish Date - Nov 17 , 2025 | 04:21 PM

ఐబొమ్మ (Ibomma)నిర్వాహకుడు ఇమ్మడి రవి Immadi ravi)అరెస్ట్‌ నేపథ్యంలో సినీ ప్రముఖులు హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు.

ఐబొమ్మ (Ibomma)నిర్వాహకుడు ఇమ్మడి రవి Immadi ravi)అరెస్ట్‌ నేపథ్యంలో సినీ ప్రముఖులు హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. ఆయనతో మీటింగ్‌ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘సినీ ఇండస్ట్రీ మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. వాళ్ల కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే బాధగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఈ పైరసీ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నాం. యాంటీ పైరసీ సెల్‌ అని పెట్టి నిఘా పెట్టినా వర్కవుట్‌ కాలేదు. ఇండస్ర్టీ మీద పరోక్షంగా, ప్రత్యక్షంగా లక్షల మంది ఆధారపడి ఉన్నారు. లైట్‌బాయ్‌ దగ్గర నుంచి అగ్ర దర్శకుల వరకూ డైరెక్టర్ల వరకూ ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు దౌర్జన్యంగా దోచుకోవడం.. తిరిగి పోలీసులకే సవాలు విసరడాన్ని తట్టుకోలేకపోయాం.

ఇలాంటి సమయంలో గతంలో సీపీ సీవీ ఆనంద్‌, అనంతరం సజ్జనార్‌ చాలా కృషి చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో పనిచేసిన టీమ్‌ అందరికీ కృతజ్ఞతలు. ప్రజలు కూడా సినిమా తమదిగా భావించాలి. పైరసీలో సినిమా చూడొద్దు. ఈ ఏడాది కూడా చాలా సినిమాలు పైరసీ చేశారు. దీనివల్ల పరిశ్రమకు ఎంతో నష్టం జరిగింది. త్వరలో రాజమౌళి గొప్ప సినిమా తీయనున్నారు. అప్పుడు మన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ సమయంలోను పైరసీ పెనుసవాలుగా ఉంటుంది. ఇండస్ర్టీ బాధను అర్థం చేసుకున్నందుకు పోలీసులను అభినందిస్తున్నా’ అని చిరంజీవి అన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 04:21 PM