Chiranjeevi: చిరంజీవిరా బచ్చా .. ఇప్పటికీ అదే గ్రేస్.. అదే జోష్
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:38 PM
ఇండస్ట్రీలో నెంబర్ 1 డ్యాన్సర్ ఎవరు.. ? ఈ ప్రశ్నకు సమాధానాలు చాలానే వస్తాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా చెప్పుకుంటూపోతే ఇండస్ట్రీలో టాప్ డ్యాన్సర్లు ఉన్నారు.
Chiranjeevi: ఇండస్ట్రీలో నెంబర్ 1 డ్యాన్సర్ ఎవరు.. ? ఈ ప్రశ్నకు సమాధానాలు చాలానే వస్తాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా చెప్పుకుంటూపోతే ఇండస్ట్రీలో టాప్ డ్యాన్సర్లు ఉన్నారు. కానీ, వారందరికన్నా ముందు ఓకే హీరో ఉన్నాడు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఆయన డ్యాన్స్ ఎవరూ చూసినా స్టెప్ వేయకుండా ఉండలేరు. అసలు తెలుగుకు బ్రేక్ డ్యాన్స్ నేర్పించిందే ఆయన. ఈపాటికే ఆయన ఎవరో అందరికీ తెలిసే ఉంటుంది. అవును ఆయన ఎవరో కాదు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).
విలన్ గా కెరీర్ ను ప్రారంభించినా స్వయంకృషితో ఎదిగి మెగా మహారాజుగా చక్రం తిప్పుతున్న హీరో చిరంజీవి. ఇండస్ట్రీలో ఏది జరిగినా అది చిరు చేతుల మీదగానే జరగాలి. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చిరు ఎన్నో సేవ కార్యక్రమాలను చేస్తూనే ఉన్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా మారాడు. విశ్వంభర ఒకపక్క షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకోపక్క అనిల్ రావిపూడి మెగా 157 చివరిదశకు చేరుకుంది. ఈ రెండు కాకుండా తనకు వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమాను అందించిన బాబీతో ఒక సినిమా ఫైనల్ చేశాడు.
వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న చిరు..లుక్ లో కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. మెగా 157 కోసం చిరు కొద్దిగా బరువు తగ్గి కనిపిస్తున్నాడు. ఇక చిరు గ్రేస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్ వేస్తే ఇప్పుడైనా సరే ప్రేక్షకులు కళ్లప్పగించి చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. డ్యాన్స్ అంటే చేతులు కాళ్ళు తిప్పడం కాదు.. ఆస్టెప్ కు ముఖంలో వచ్చే గ్రేస్, జోష్.. ఏ వయస్సు వారు చూసినా కాలు కదిపేలా చేయగలగాలి. అది చిరుకు సాధ్యమైనట్లు ఇంకెవరికీ సాధ్యం కాదు. అందుకు ఒక చిన్న ఉదాహరణే ఈ చిన్న వీడియో క్లిప్.
మెగాస్టార్ చిరంజీవి ఒక టీవీ ఛానెల్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. అక్కడ ఆయన రావడంతో పెద్ద అభిమాన సునామీ వచ్చేసింది. ఆరాధ్య దైవం ఒక్కసారిగా కళ్ళముందుకు రాగానే బుల్లితెర సెలబ్రిటీలు కళ్ళు అప్పగించి ఆయనను చూస్తూ ఉండిపోయారు. ఇక స్టేజిమీద కుర్ర హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో పాటు కొందరు ముద్దుగుమ్మలు.. చిరు సాంగ్స్ కు స్టెప్స్ వేస్తూ ఆయనను ఇంకా ఉర్రూతలూగించారు. ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చామంతి పువ్వా సాంగ్ కు రోజాతో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఆ సాంగ్ లో రోజా అందాలు.. చిరు గ్రేస్, ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత కూడా చిరు లో ఆ గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. అదే ఎనర్జీతో 69 ఏళ్ళ వయస్సులో కూడా తగ్గేదే లేదు అన్నట్లు చిరు ఆ స్టెప్స్ వేస్తుంటే.. ఫ్యాన్స్ సంతోషంతో గంతులు వేస్తున్నారు. చిరంజీవిరా బచ్చా.. ఇప్పటికీ అదే గ్రేస్, అదే జోష్ అంటూ అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. మెగా అభిమానాన్ని చాటి చెప్తున్నారు. ఏదిఏమైనా డ్యాన్స్ ల్లో చిరును కొట్టేవారు లేరు అని చెప్పడంలో తప్పే లేదు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.