Spirit: ప్రభాస్ కు తండ్రిగా చిరంజీవి.. హైప్ తోనే చంపేస్తావా వంగా
ABN , Publish Date - Sep 28 , 2025 | 10:10 PM
టైటిల్ చూడగానే.. ఏం మాట్లాడుతున్నారు. అది నిజం అవుతుందా.. ? అసలు అని అనుకోవడంలో తప్పు లేదు. అలా అని నిజం అయ్యే ఛాన్స్ లు కూడా లేకపోలేదు.
Spirit: టైటిల్ చూడగానే.. ఏం మాట్లాడుతున్నారు. అది నిజం అవుతుందా.. ? అసలు అని అనుకోవడంలో తప్పు లేదు. అలా అని నిజం అయ్యే ఛాన్స్ లు కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త కొత్త మార్పులు చూస్తూనే ఉన్నాం. నాగార్జున(Nagarjuna) హీరోగా తప్ప ఇంకే క్యారెక్టర్ లో కనిపించడు అనుకున్నారు. కానీ, నాగ్ విలన్ గా కూడా కనిపించాడు. ఇక మోహన్ బాబును ఎవరైనా మళ్లీ విలన్ గా చూస్తాం అనుకున్నారా.. ? కానీ, ది ప్యారడైజ్ లో నానికి విలన్ గా అదరగొట్టడానికి సిద్దమయ్యాడు. ఏమో చిరంజీవి కూడా.. ప్రభాస్ కు తండ్రిగా నటిస్తాడేమో అని అనుకోవచ్చుగా అనేది సోషల్ మీడియాలో కొందరి వాదన. అసలు ఈ రూమర్ ఏంటి అనేది తెలుసుకుందాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తోంది. మొన్నటివరకు ఆగస్టులో స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుంది అన్న సందీప్.. సెప్టెంబర్ వెళ్లిపోతున్నా ఇప్పటివరకు అప్డేట్ ఇచ్చింది లేదు. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి చిన్న వార్త బయటకు వచ్చినా కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అని చెప్పొచ్చు.
ఉదయం నుంచి స్పిరిట్ నుంచి ఒక వార్త సోషల్ ,మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు తండ్రిగా చిరంజీవి నటిస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వంగాకు చిరు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆఫీస్ లో చిరు రేర్ ఫోటో ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికి తెల్సిందే. ఇక చిరు సైతం వంగా దర్శకత్వంలో చేయాలని చూస్తున్నట్లు అర్జున్ రెడ్డి సినిమా దగ్గర నుంచి వార్తలు వినిపించాయి.
ప్రభాస్ తండ్రి పాత్ర ఈ సినిమాలో చాల కీలకమని, యానిమల్ లో అనిల్ కపూర్ లాంటి పాత్ర అని.. దానికి చిరు అయితే చాలా బావుంటుందని వంగా భావించి.. చిరుతో కూడా మాట్లాడినట్లు చెప్పుకొస్తున్నారు. అసలు ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. థియేటర్లు బద్దలు అవ్వడం, ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. త్వరగాస్పిరిట్ అప్డేట్ ఇవ్వు వంగా .. లేకపోతే ఇలాంటి హైప్ తోనే చచ్చేలా ఉన్నామని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Tollywood Heroes: ఆ ఇద్దరు అమ్మాయిలతో.. హీరో బ్రదర్స్ కు పెళ్లి
NTR: నొప్పి ఎక్కువైనా స్పీచ్ ఆపని ఎన్టీఆర్.. రిషబ్ గురించి ఏం చెప్పాడంటే