Tollywood Heroes: ఆ ఇద్దరు అమ్మాయిలతో.. హీరో బ్రదర్స్ కు పెళ్లి
ABN , Publish Date - Sep 28 , 2025 | 09:35 PM
టాలీవుడ్ (Tollywood) లో పెళ్లి కానీ హీరోలు చాలామంది ఉన్నారు. ఈ ఏడాది చాలామంది పెళ్లి పీటలు కూడా ఎక్కారు.
Tollywood Heroes: టాలీవుడ్ (Tollywood) లో పెళ్లి కానీ హీరోలు చాలామంది ఉన్నారు. ఈ ఏడాది చాలామంది పెళ్లి పీటలు కూడా ఎక్కారు. ఇకవచ్చే ఏడాది కూడా టాలీవుడ్ బ్యాచిలర్స్.. పెళ్లి కొడుకులుగా మారనున్నారు. ఇప్పటికే అల్లు శిరీష్ పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా మరో ఇద్దరు హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరు హీరోలు కూడా అన్నదమ్ములే కావడం విశేషం. మొదట అన్నయ్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. విజయాపజయాలను లెక్క చేయకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు.
ఈ మధ్యనే అన్నయ్య నటించిన చిత్రం రిలీజ్ కాబోయి వాయిదా పడింది. ఇక తమ్ముడు మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయాడు. కానీ, ఆ తరువాత అలాంటి హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి ఇష్టం. ముఖ్యంగా అన్నకు తమ్ముడంటే ప్రాణమని చెప్పాలి. ఇద్దరూ కూడా పెద్దల మాట జవదాటని హీరోలే. కుటుంబంలో పెద్ద ఏది చెప్తే అదే వింటారు. ఇక అన్నకు ఇండస్ట్రీలో ఒకటి రెండు రిలేషన్స్ ఉండడం, అవి బ్రేకప్ అవ్వడం కూడా జరిగాయి.
ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం వయస్సు పెరుగుతుండడంతో ఇంట్లోవాళ్లు ఈ ఇద్దరి హీరోలకు పెళ్లి చేయాలనీ నిశ్చయించారట. ఇద్దరు ప్రస్తుతం సింగిల్ స్టేటస్ నే మైంటైన్ చేయడంతో ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయిలనే చేసుకుంటామని మాట ఇచ్చారట. దీంతో కుటుంబ పెద్దలు ఈ ఇద్దరి హీరోల కోసం మంచి సంబంధాలనే తీసుకొచ్చారని సమాచారం.
ఇక ఇద్దరు అమ్మాయిలు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాల్లో సెటిల్ అయ్యినవారట. ప్రస్తుతం ఆ ఇద్దరు అమ్మాయిలతో ఈ హీరోలు కూడా మాట్లాడుతున్నారని టాక్. అన్ని బావుంటే వచ్చే ఏడాదిలోనే ఈ అన్నదమ్ముల పెళ్లిళ్లు జరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి కుటుంబ పెద్దల మాట గౌరవించి పెళ్లి చేసుకుంటున్న ఏ హీరోల కెరీర్.. పెళ్లి తరువాత మారుతుందేమో చూడాలి.
NTR: నొప్పి ఎక్కువైనా స్పీచ్ ఆపని ఎన్టీఆర్.. రిషబ్ గురించి ఏం చెప్పాడంటే
Akkineni Sobhita: అక్కినేని కోడలు.. సమంతను మరిపిస్తుందిగా