సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Megastar Chiranjeevi: శరవేగంగా.. 'మన శంకర వర ప్రసాద్ గారు' పోస్ట్ ప్రొడక్షన్

ABN, Publish Date - Dec 23 , 2025 | 08:54 PM

చిరంజీవి, నయనతార జంటగా నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ జనవరి 12న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది.

Mana Shakara Vara Prasad Garu Movie

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది.

విక్టరీ వెంకటేష్ (Venkatesh) కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


తాజాగా మేకర్స్ సినిమా నుంచి రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి కొత్త స్టిల్ అదిరిపోయింది. బ్లాక్ సూట్, వైట్ షర్ట్, కళ్లకు డార్క్ గ్లాసెస్ తో ఒక చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న మెగాస్టార్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 'మీసాల పిల్ల, శశిరేఖ..' పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్ గా సంచలనం సృష్టించాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చిరంజీవి, వెంకటేష్ పై చిత్రీకరీంచిన పాటని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని, తమ్మిరాజు ఎడిటింగ్‌ను, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. కథను ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సంయుక్తంగా రాశారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది.

Updated Date - Dec 23 , 2025 | 10:38 PM