సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mana Shankaravara Prasad Garu: స్టైలిష్ క్లైమాక్స్‌.. సిద్ధం చేసిన 'మన శంకరవరప్రసాద్ గారు'

ABN, Publish Date - Nov 03 , 2025 | 07:51 AM

చిరంజీవి కథానాయకుడిగా ఆనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు సినిమా మాటింగ్ శరవేగంగా సాగుతోంది.

Chiranjeevi

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా ఆనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankaravara Prasad Garu), నయనతార కథానాయిక. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌ సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా మాటింగ్ శరవేగంగా సాగుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీలక షెడ్యూల్ గురించి అప్డేట్ ఇచ్చారు. మేకర్స్. ఆదివారం నుంచి చిరంజీవి, ఫైటర్స్ బృందంపై స్టైలిష్ క్లైమాక్స్ షూట్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని, విజువల్‌గా అద్భుత అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేశ్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

Updated Date - Nov 03 , 2025 | 08:10 AM