సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi Konidela: త‌మ్ముడు క‌ల్యాణ్‌.. రాజువై సైన్యాన్ని న‌డిపించు! ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌కు.. చిరంజీవి ఎమోష‌న‌ల్ మెసేజ్‌

ABN, Publish Date - Aug 22 , 2025 | 08:51 AM

ట్విట్ట‌ర్ వేదిక‌గా చిరంజీవి స‌డ‌న్ స‌ర్ఫ్రైజ్ ఫొటోల‌తో యావ‌త్ మెగాభిమానుల‌కు మ‌రిచిపోలేని అనుభూతిని అందించారు.

Chiranjeevi Pawan Kalyan

ట్విట్ట‌ర్ వేదిక‌గా చిరంజీవి (Chiranjeevi Konidela) స‌డ‌న్ స‌ర్ఫ్రైజ్ ఫొటోల‌తో యావ‌త్ మెగాభిమానుల‌కు మ‌రిచిపోలేని అనుభూతిని అందించారు. త‌న కెరీర్ ఆరంభంలో జ‌రిగిన త‌న ప‌ట్టిన రోజు వేడుక‌లో చిన్న నాటి ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)ఉన్న చిత్రాల‌ను అభిమానుల‌తో పంచుకుంటూ .. జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు! త‌మ్ముడు క‌ల్యాణ్‌... అంటూ త‌న అశీస్సులు అందించాడు.

ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. ప్ర‌తీ మాట‌.. ప్ర‌తీ అక్ష‌రం నా హృద‌యాన్ని తాకింది. అన్న‌య్య‌గా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్య‌దీక్ష‌త‌, ప‌ట్టుద‌ల చూసి ప్ర‌తీ క్ష‌ణం గ‌ర్వ‌ప‌డుతూనే ఉన్నా. నిన్ను న‌మ్మిన‌వాళ్ల‌కు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుంది.

ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జన‌సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు. అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి. ఓ అన్న‌య్య‌గా నా ఆశీర్వ‌చ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్ర‌తీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నాను. అంటూ వ్రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతోంది.

Updated Date - Aug 22 , 2025 | 09:17 AM