సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi Lineup: మెగాస్టార్ లైనప్ చూస్తుంటే మెంటలొచ్చేస్తుందిగా

ABN, Publish Date - Jul 28 , 2025 | 10:12 PM

ప్లాప్ లు వచ్చాయి.. పక్కకు వెళ్లిపోతాడనుకున్నారు. వయస్సు అవుతుంది.. ఇంకెందుకులే సినిమాలు అని అనుకున్నారు. కనీసం సీనియర్ డైరెక్టర్లను అయినా లైన్లో పెట్టి అడపా దడపా కనిపిస్తాడు అని అనుకున్నారు.

Chiranjeevi

Chiranjeevi Lineup: ప్లాప్ లు వచ్చాయి.. పక్కకు వెళ్లిపోతాడనుకున్నారు. వయస్సు అవుతుంది.. ఇంకెందుకులే సినిమాలు అని అనుకున్నారు. కనీసం సీనియర్ డైరెక్టర్లను అయినా లైన్లో పెట్టి అడపా దడపా కనిపిస్తాడు అని అనుకున్నారు. కానీ, అదే పౌరుషంతో..మంచి మంచి కథలను పట్టి.. కుర్ర డైరెక్టర్లను లైన్లో పెట్టి.. కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఒకటి కాదు రెండు కాదు నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఇండస్ట్రీలో మెగా జోరు చూపిస్తున్నాడు.


భోళా శంకర్ లాంటి భారీ పరాజయం తరువాతచిరు కొద్దిగా కృంగిన మాట వాస్తవమే కానీ, అక్కడితో ఆగిపోలేదు. వెంటనే వశిష్ఠతో విశ్వంభర మొదలుపెట్టాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ సినిమా ఫినిష్ అవ్వలేదు.. అప్పుడే అనిల్ రావిపూడితో ఇంకో సినిమాను పట్టాలెక్కించాడు చిరు. అసలు ఇది కొద్దిగా గ్యాప్ కూడా లేకుండా మూడు షెడ్యూల్స్ ను ముంగించేశాడు.


అయ్యబాబోయ్ ఇదెక్కడి విడ్డూరం అమ్మా.. ఈ వయస్సులో రెండు సినిమాలు ఏకధాటిగా షూటింగ్స్ చేస్తున్నాడు అని అందరూ నోర్లు నొక్కుకోవడం మొదలుపెట్టారు. సరే ఈ రెండు సినిమాలే కదా అనుకుంటే పొరపాటే. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్ లో ఉండగానే చిరు.. మరో రెండు సినిమాలను లైన్లో పెట్టి షాక్ ల మీద షాకులు ఇచ్చాడు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించిన చిరు.. తనకు వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ను ఇచ్చిన బాబీ కొల్లితో మరో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.


అలా నలుగురు కుర్ర డైరెక్టర్స్ తో చిరు జోరు పెంచేశాడు. త్వరలోనే మిగిలిన రెండు సినిమాలు కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట చిరు. ఎంత కుర్ర డైరెక్టర్స్ అయినా.. అందరూ ఇండస్ట్రీలకు హిట్స్ ఇచ్చినవారే. అందుకే ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. మరి ఈ సినిమాలతో చిరు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jul 28 , 2025 | 10:16 PM