Chiranjeevi: విజయ్ సభలో 39 మంది మృతి.. చిరు స్పందన
ABN, Publish Date - Sep 28 , 2025 | 11:23 AM
నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ (TVK - Vijay) ప్రచారసభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. త
నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ (TVK - Vijay) ప్రచారసభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తమిళనాడు కరూర్‌లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో కొందరు చనిపోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఈ మేరకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ 'తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట చాలా విషాదకరం, ఈ విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి' అని పేర్కొన్నారు.
ఇదే విషయం పై పార్టీ నాయకుడు విజయ్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ‘నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.