Thaali Kattu Subhavela: గ్రామీణ శైలిని ప్రతిబింబించే 'తాళికట్టు శుభవేళ'
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:10 PM
తిలక్ రాజ్, తుంగ హీరోహీరోయిన్స్ గా, దేవరాజ్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం 'తాళికట్టు శుభవేళ' (Thaali Kattu Subhavela). శ్రీ వెంకటా చలపతి ఫిలింస్ పతాకంపై బి. అరుణ్ కౌశిక్ నిర్మాణంలో, వి. జగన్నాధరావ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది.
తిలక్ రాజ్, తుంగ హీరోహీరోయిన్స్ గా, దేవరాజ్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం 'తాళికట్టు శుభవేళ' (Thaali Kattu Subhavela). శ్రీ వెంకటా చలపతి ఫిలింస్ పతాకంపై బి. అరుణ్ కౌశిక్ నిర్మాణంలో, వి. జగన్నాధరావ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఫిలిం ఛాంబర్ లో జరిగింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త, తల్లాడ సాయికృష్ణ, నటి-ప్రముఖ వ్యాఖ్యాత స్వప్న చౌదరి తదితరులు హాజరై, వీడియో సాంగ్స్, ట్రైలర్ విడుదల చేశారు. గ్రామీణ శైలిని ప్రతిబింబించే వినూత్న కథాతో, వినోదం, భావోద్వేగాన్ని సమపాళ్లలో కలగలిపిన చిత్రమిదని దర్శకుడు చెప్పారు.
ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ 'తాళికట్టు శుభవేళ' సినిమా పేరు విన్నప్పుడే ఎంతో పాజిటివ్‌గా అనిపించింది. పాటలు చాలా మధురంగా ఉన్నాయి. కొత్త తరానికి విలువలు నేర్పే మంచి కుటుంబ కథతో ఈ చిత్రం నిలిచిపోతుందని నమ్ముతున్నాను' అన్నారు.
సంగీత దర్శకుడు వి.ఆర్.ఎ. ప్రదీప్ మాట్లాడుతూ 'తాళికట్టు శుభవేళ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచే ఈ చిత్రంపై మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. కుటుంబ కథాంశంతో, భావోద్వేగాలతో, వినోదంతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. ఇలాంటి శుభ్రమైన సినిమాలు ఎక్కువగా రావాలి. నిర్మాతలు, దర్శకుడు ఎంతో శ్రద్ధతో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. మరో గోరింటాకు సినిమాగా విజయవంతం కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.