Chiranjeevi: మరో వారసుడికి స్వాగతం పలికిన మెగాస్టార్

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:21 PM

మెగా కుటుంబంలో మరోసారి ఆనందాలు వెల్లివిరిసాయి. మెగా బ్రదర్స్.. తండ్రుల దగ్గర నుంచి తాతలుగా మారుతున్నారు.

Varun Tej - Lavanya

Chiranjeevi: మెగా కుటుంబంలో మరోసారి ఆనందాలు వెల్లివిరిసాయి.మెగా బ్రదర్స్.. తండ్రుల దగ్గర నుంచి తాతలుగా మారుతున్నారు. రెండేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. తాతగా మారిన విషయం తెల్సిందే. రామ్ చరణ్ - ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి క్లింకార అని పేరు పెట్టారు. కారా పుట్టిన దగ్గరనుంచి మెగా ఫ్యామిలీలో విజయాలే విజయాలు. ఇక ఇప్పుడు మరో వారసుడు మెగా ఇంట అడుగుపెట్టాడు.


చిరంజీవి తమ్ముడు, మెగా బ్రదర్ నాగబాబు తాత అయ్యాడు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ భార్య లావణ్య నేడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో మరోసారి సంబురాలు మొదలయ్యాయి. అయితే ఈసారి మెగా ఇంట ఈ బాబు చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. అదేంటంటే.. చిరుకు ఇప్పటివరకు అందరూ మనవరాళ్లే జన్మించారు. ఇద్దరు కూతుళ్ళకు, కొడుకు చరణ్ కు కూడా ఆడపిల్లలే. మా ఇల్లు మొత్తం లేడీస్ హాస్టల్ గా ఉంటుంది అని చిరునే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


ఇక ఇప్పుడు వారందరి మధ్య ఒక మగపిల్లాడు వచ్చాడు. మెగా వారసుడు వచ్చాడు. అందుకే ఈసారి సంబురాలు మరింత ఎక్కువ ఉండనున్నాయి. వారసుడు పుట్టాడు అని తెలియగానే చిరు.. షూటింగ్ ను పక్కనపెట్టి మరీ హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకొని మెగా వారసుడిని ఎత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలనుఁ వరుణ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఇక చిరు.. కొణిదెల కుటుంబంలోనికి మరో వారసుడిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు.


'చిన్నారి.. ప్రపంచంలోకి స్వాగతం. కొణిదెల కుటుంబంలో పుట్టిన చిన్నారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. గర్వించదగిన తల్లిదండ్రులు అయినందుకు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠికి హృదయపూర్వక అభినందనలు. గర్వించదగిన తాతామామలుగా పదోన్నతి పొందిన నాగబాబు మరియు పద్మజకు చాలా సంతోషంగా ఉంది. ఆ బిడ్డకు అన్ని రకాల సంతోషాలు, మంచి ఆరోగ్యం మరియు సమృద్ధిగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా బిడ్డ చుట్టూ ఉండాలి' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Mana Shankara Vara Prasad Garu: మన శంకర వరప్రసాద్ గారిని కలిసిన పూరిసేతుపతి

VarunTej Lavanya: వార‌సుడొచ్చాడు.. తండ్రైన మెగా హీరో!

Updated Date - Sep 10 , 2025 | 04:21 PM