Akkineni Nagarjuna: లాటరీ కింగ్ లో చిరంజీవి.. థియేటర్లు దద్దరిల్లడమే
ABN , Publish Date - Oct 21 , 2025 | 02:39 PM
ఒకప్పుడు ఇండస్ట్రీలో మల్టీస్టారర్స్ అనేవి సాధారణంగా అనిపించేవి. ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో సినిమాలో చిన్న పాత్ర, పెద్ద పాత్ర అనేది చూడకుండా కేవలం స్నేహానికి విలువ ఇచ్చి చేసేవారు.
Akkineni Nagarjuna: ఒకప్పుడు ఇండస్ట్రీలో మల్టీస్టారర్స్ అనేవి సాధారణంగా అనిపించేవి. ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో సినిమాలో చిన్న పాత్ర, పెద్ద పాత్ర అనేది చూడకుండా కేవలం స్నేహానికి విలువ ఇచ్చి చేసేవారు. ఇక ఇప్పుడు మల్టీస్టారర్ అంటే ఒక పెద్ద టాస్క్. ఒకరికి అంటే ఒకరికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండకూడదు. ఇద్దరికీ అన్నీ సమానంగా ఉండాలి. ఇక ఒక స్టార్ హీరో సినిమాలో ఇంకో హీరో క్యామియో చేసినా కూడా అది డబ్బు కోసం అని ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఎన్ని జనరేషన్స్ మారినా టాలీవుడ్ స్టార్ హీరోల స్నేహాన్ని మాత్రం అలాగే కొనసాగుతుంది. వారే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలు.. హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోలకు సైతం షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఒకరి సినిమాలో ఒకరు క్యామియోల్లో నటిస్తూ తమ స్నేహాన్ని నిరూపించుకుంటున్నారు.
అసలు విషయం ఏంటంటే.. అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన వందవ సినిమాపై ఫోకస్ చేస్తున్న విషయం తెల్సిందే. రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రంలో అనుష్క, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగ్ వందవ చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. నాగ్ కూడా తన వందవ సినిమా అభిమనులందరూ గుర్తుండిపోయేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే అనుష్కను, టబును తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఇప్పుడు ఈ సినిమాను మరింత హైప్ పెంచడానికి నాగ్ గట్టి ప్లాన్ వేశాడు. లాటరీ కింగ్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది క్యామియోనా.. లేక పెద్ద పాత్ర అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ, ఈ పాత్ర మాత్రం సినిమాకు చాలా కీలకమని, అందుకే చిరును తీసుకున్నట్లు సమాచారం. చిరు - నాగ్ ఒకే సినిమాలో కలిసి కనిపిస్తే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
Allu Sneha Reddy : పెళ్లి కూడా కాలేదు.. అప్పుడే తోడికోడలిని సైడ్ చేసిన అల్లు అర్జున్ భార్య
Eesha Rebba:పెళ్లయిన డైరెక్టర్ తో ప్రేమ.. అవసరమా ఈషా