Allu Sneha Reddy : పెళ్లి కూడా కాలేదు.. అప్పుడే తోడికోడలిని సైడ్ చేసిన అల్లు అర్జున్ భార్య
ABN , Publish Date - Oct 21 , 2025 | 12:56 PM
ఈసారి దీపావళీ పండగ అల్లు వారి కుటుంబానికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ మధ్యనే అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం మరణించిన విషయం తెల్సిందే.
Allu Sneha Reddy: దీపావళీ పండగను దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకున్న విషయం తెల్సిందే. బంధుమిత్రులతో.. అన్ని కుటుంబాలు కళకళలాడుతూ తమ జీవితాల్లో ఉన్న చీకటిని తొలగిస్తూ దీపాలను వెలిగించి కొత్త వెలుగును నింపుకున్నారు. ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం తమ కుటుంబాలతో ఈ దీపాల పండగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. గత రెండు రోజుల నుంచి దీవాళీ ఫొటోస్ తో సోషల్ మీడియా కన్నుల విందుగా ఉంది.
ఇక ఈసారి దీపావళీ పండగ అల్లు వారి కుటుంబానికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ మధ్యనే అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం మరణించిన విషయం తెల్సిందే. ఆ బాధ నుంచి తేరుకోవడానికి అల్లు అరవింద్.. తన రెండో కొడుకు అల్లు శిరీష్ కు వివాహాం జరిపించే పనిలో పడ్డాడు. నైనికా అనే అమ్మాయితో శిరీష్ పెళ్లి జరగబోతుందని అధికారికంగా ప్రకటించారు. శిరీష్ సైతం తన పెళ్లి తేదీ త్వరలోనే చెప్తాను అని తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోలను షేర్ కూడా చేశాడు.
శిరీష్ పెళ్లి ఫిక్స్ అయిన తరువాత వచ్చిన మొదటి దీపావళీ కావడంతో.. అల్లు ఇంట చిన్న కోడలిగా నైనికా కూడా ఈ పండగ సెలబ్రేషన్స్ లో పాలు పంచుకుంది. నైనికా రాకతో అల్లు కుటుంబం సంపూర్ణం అయ్యింది. అల్లు అరవింద్.. ముగ్గురు కొడుకులు.. ముగ్గురు కోడళ్ళు .. మనవళ్లు, మనవరాళ్ల ఆటపాటలతో, అల్లరితో కళకళలాడిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి.
ఇక ఇవే ఫోటోలను అల్లు స్నేహ కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే.. ఫ్యామిలీ ఫొటోలో తోడికోడలు ఫోటోను మాత్రం సైడ్ చేసింది. నైనికా ముఖాన్ని క్రాప్ చేసి కేవలం శిరీష్ ఉన్నంతవరకే ఆ ఫొటోలో కనిపించేలా చూపించింది. 2025 దీవాళీ అని క్యాప్షన్ ఇచ్చింది. స్నేహ పోస్ట్ చేయకముందే ఆ ఫ్యామిలీ ఫోటోలు నైనికా ఫొటోతో సహా పీఆర్ ల ద్వారా బయటకు వచ్చాయి. కానీ, స్నేహ మాత్రం తోడికోడలు ఫోటో క్రాప్ చేయడంతో నెటిజన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కూడా కాలేదు అప్పుడే తోడికోడలిని సైడ్ చేసేసింది అని, ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి తరువాత ఎలా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది ట్రోల్ అవ్వకుండా పెద్ద కోడలు ముందు జాగ్రత్త తీసుకుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Allu Family: అల్లు వారి ఇంట దివాళీ సంబురం.. కొత్త కోడలు రాక
Eesha Rebba:పెళ్లయిన డైరెక్టర్ తో ప్రేమ.. అవసరమా ఈషా