Ramcharan: నాన్న.. ఈ రోజు కేవలం మీ పుట్టిన రోజు మాత్రమే కాదు! రామ్‌చరణ్ ఎమోషనల్ పోస్ట్
ABN, Publish Date - Aug 22 , 2025 | 01:05 PM
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగాయి.
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) జన్మదినం వేడుకలు కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా చిరంజీవి తన కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కట్ చేసి రామ్ చరణ్‌కు తినిపించగా అనంతరం రామ్ చరణ్ (ram charan) తండ్రి అశీర్వాదం తీసుకుని కేక్ తినిపించారు.
ఈ సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ .. ఈ రోజు కేవలం మీ పుట్టిన రోజు మాత్రమే కాదు.. సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన రోజు మీరు నా మార్గదర్శి, నాకు ప్రేరణ మీరు. నేను సాధించిన ప్రతి విజయానికి, నేర్చుకున్న ప్రతి విలువకు మూలం మీరు. 70 ఏళ్ల వయసులోనూ మీరు మాకు మరింత ప్రేరణగా నిలుస్తున్నారు, మీ ఆరోగ్యం, ఆనందం కలకాలం ఇలానే ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టుతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ కేక్ కట్ చేసే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.