Chiru Anil: చిరు, అనీల్.. జోరు మాములుగా లేదుగా!

ABN , Publish Date - Jun 19 , 2025 | 07:17 PM

చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

mega157

చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మెగా 157 (Mega157) వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార (Nayanthara) నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లోని మసూరీలో స్టార్ట్ చేసిన‌ రెండో షెడ్యూల్ ముగియ‌డంతో చిరంజీవి సహా ప్రధాన తారాగణం అంతా గురువారం తిరిగి వ‌చ్చేశారు. ఈ మేర‌కు మూవీ టీం సైతం సెకండ్ షెడ్యూల్ పూర్త‌యిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

157.jpg

ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించారు. కాగా ఈ మూవీని 2026 సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్లకు తీసుకు వ‌స్తున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇదిలాఉంటే దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న‌ అనిల్‌ రావిపూడి ఈ సినిమాను కూడా ప్రేమ, కుటుంబ సంబంధిత అంశాల‌తో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ (Shine Screens), గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Gold Box Entertainments) బేనర్‌పై సాహు గారపాటి (Sahu Garapati), సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీతం అందిస్తున్నాడు.

Updated Date - Jun 19 , 2025 | 07:34 PM