సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiru - Venky: ఓ పక్క రీయూనియన్‌.. మరో పక్క ఇద్దరికీ కొత్త షెడ్యూల్‌

ABN, Publish Date - Oct 04 , 2025 | 09:21 PM

అగ్ర హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

అగ్ర హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. 80వ దశకంలో వెండితెర వేదికగా ఆడిపాడి అలరించిన దక్షిణాది, ఉత్తరాది నటీనటులందరూ ఒకేచోట కలుస్తూ సరదాగా గడుపుతుంటారు. అలనాటి జ్ఞాపకాలను నెమరు  వేసుకుంటారు. దీనికి '80s' రీయూనియన్‌’ అనే పేరు పెట్టారు. ప్రతి ఏటా చెన్నై, హైదరాబాద్‌, ఊటీ ప్రాంతాల్లో ఏదో ఒక చోట ఈ వేడుక నిర్వహిస్తుంటారు. అక్కడికి వెళ్తూ చిరంజీవి, వెంకటేశ్‌ ఫొటోకు ఫోజ్‌ ఇచ్చారు. సుహాసిని, రాధిక ఈ వేడుక బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తుంటారు.

20 నుంచి సెట్స్‌లో వెంకటేశ్‌..

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ జెట్‌ వేగంగా నడుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకు ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర కథను మలుపు తిప్పే పాత్రని దర్శకుడు ఇప్పటికే చెప్పారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ అక్టోబర్‌ 6 నుంచి మొదలు కానుంది. ఇప్పటి వరకూ జరిగిన షెడ్యూల్స్‌లో ఇదే పెద్ద షెడ్యూల్‌ అని తెలుస్తోంది. దీనిలో చిరంజీవి, వెంకటేష్‌ పై సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారని తెలిసింది. అక్టోబర్‌ 20 నుంచి వెంకటేశ్‌ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్‌తో ఆల్మోస్ట్‌ షూటింగ్‌ పూర్తవుతుంది. ఈ చిత్రంలో నయనతార కథానాయిక. తాజాగా ఆమెపై సాగే మీసాల పిల్ల’ అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటను ఉదిత్‌ నారాయణ పాడారు. భీమ్స్‌ సంగీత దర్శకుడు.  

Updated Date - Oct 04 , 2025 | 09:21 PM