సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiru - Pawan: అన్నదమ్ముల సంభాషణ.. ఆర్‌జీవీ కామెంట్‌..

ABN, Publish Date - Sep 23 , 2025 | 11:16 AM

తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి పెట్టిన పోస్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. అన్నయ్యపై పవన్‌ కల్యాణ్‌ అభిమానాన్ని చాటారు. పలు సందర్భాల్లో చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశారు. 

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తొలి చిత్రం  ‘ప్రాణం ఖరీదు’ (Pranam Kharidhu)సినిమా విడుదలై ఈ నెల 22వ తేదికి 47 ఏళ్లు పూర్తయింది. ఈ తరుణంలో తనను ఇన్నేళ్లుగా ఆదరిస్తూ మెగాస్టార్‌ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ, తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్‌ పెట్టారు. దాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. అన్నయ్యపై పవన్‌ కల్యాణ్‌ అభిమానాన్ని చాటారు. పలు సందర్భాల్లో చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశారు.  (Ram Gopal varma Reaction)

అన్నయ్య పుట్టకతో యోధుడు... 
‘ప్రాణం ఖరీదు’లో అన్నయ్య హీరోగా నటించిన రోజులు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. అప్పుడు మేం నెల్లూరులో ఉండేవాళ్లం. అప్పటికి నేను స్టూడెంట్‌ని. సినిమా చూసేందుకు కనకమహల్‌ థియేటర్‌కు వెళ్లినప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 47 ఏళ్ల ప్రయాణంలో ప్రతి విషయంలోనూ అన్నయ్య ఎంతో ఎదిగాడు. ఇప్పటికీ అదే వినయం. ఇతరులకు అండగా ఉండటం, సహాయం చేయడంలో ఏ మార్పూ రాలేదు. ఇలాగే ఎప్పుడూ విజయాలు అందుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నా. భవిష్యత్తులో ఆయన్ను మరిన్ని విభిన్న పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నా. అన్నయ్య పుట్టకతో యోధుడు. అనుకుంటే తప్ప ఆయనకు రిటైర్మెంట్‌ అనేదే లేదు’ అని పేర్కొన్నారు.


 


గడిచిన రోజులు గుర్తొచ్చాయి కల్యాణ్‌బాబు..
పవన్‌ ట్వీట్‌కు చిరంజీవి కూడా స్పందించారు. ‘ప్రియమైన కల్యాణ్‌ బాబు.. నీ మాటలు నన్ను లోతుగా తాకి, మళ్లీ గడిచిన రోజులకు తీసుకెళ్లాయి.  ‘ప్రాణం ఖరీదు’ నుంచి నేటి వరకు వరకు అన్ని విషయాల్లోనూ కుటుంబం, స్నేహితులు, అభిమానులు, ప్రేక్షకులు నుంచి ఎంతో ప్రేమ, ప్రోత్సాహం నాకు దక్కాయి. వారి ప్రేమకు ఎంతో కృతజ్ఞుడిని. వారందరి మద్దతు, ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు. ‘ఓజీ’ ట్రైలర్‌ నాకు బాగా నచ్చింది. సినిమా పెద్ద విజయం సాధించాలి. ‘ఓజీ’ చిత్రబృందం నిజంగా దానికి అర్హులు’ అని చిరంజీవి పేర్కొన్నారు.  

మెగా పవర్‌ సినిమా అవుతుంది: రామ్‌గోపాల్‌ వర్మ

వీరిద్దరి సంభాషణలపై వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పోస్ట్‌ చేశారు. ఆయన ట్వీట్‌ మెగా అభిమానుల్ని ఆకర్షిస్తోంది. పవన్‌ పోస్ట్‌ను రీట్వీట్‌ చేసి చిరు, పవన్‌ కలిసి సినిమా తీయాలని కోరారు. ‘మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్‌ అందరికీ మెగా పవర్‌ జోష్‌ నింపినట్లు అవుతుంది. ఆ చిత్రం ఈ శతాబ్దంలోనే మెగా పవర్‌ సినిమా అవుతుంది’ అని రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

‘మేరా దేశ్‌ పహ్లే: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ శ్రీ నరేంద్రమోదీ’ విషయానికొస్తే.. ప్రముఖ రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ ఈ కాన్సర్ట్‌ను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన బాల్యం నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిన తీరును పాట రూపంలో రూపొందించారు. ముంబయిలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Also Read: Film Awards: జాతీయ సినిమా అవార్డుల ప్రదానం

Also Read: Pawan Kalyan: 'ఎ' సర్టిఫికెట్ ప్రభావం 'ఓజీ'పై పడుతుందా...

Updated Date - Sep 23 , 2025 | 12:55 PM