Chiranjeevi: చిరుతో అనిల్‌ వేగం మామూలుగా లేదు..

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:53 AM

అగ్ర కథానాయకుడు చిరంజీవి మంచి జోరు మీదున్నారు. తన తాజా చిత్రం అప్పుడే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) మంచి జోరు మీదున్నారు. తన తాజా చిత్రం అప్పుడే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార (Nayanatara) కథానాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టిన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితోపాటు ప్రధాన తారాగణంపై కీలక టాకీ పార్ట్‌ను పూర్తి చేశారు.  తదుపరి షెడ్యూల్‌ ఈ వారాంతంలోనే మొదలు కానుందని తెలిసింది. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రమిది. చిరంజీవి ఇందులో తన సొంత పేరైన శివ శంకర్‌ వరప్రసాద్‌ అనే పాత్రలో కనిపించనున్నారు. వెంకటేశ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 


ALSO READ: Sekhar Kammula: ఆయనతో సినిమా తీయాలనే ఫీలింగ్‌ అంతే.. 

Updated Date - Jun 01 , 2025 | 12:03 PM