సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ArjunAmbati: పరమపద సోపానం నుంచి.. చిన్ని చిన్ని తప్పులేవో లిరిక‌ల్

ABN, Publish Date - May 24 , 2025 | 10:37 AM

బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన అర్జున్ అంబటి హీరోగా న‌టించిన చిత్రం ప‌ర‌మ‌ప‌ద సోపానం.

arjun

అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న న‌టుడు అర్జున్ అంబటి (Arjun Ambati). ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆయ‌న‌ ఇటీవ‌ల ఆయ‌న 'తెప్పసముద్రం' 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిధ్యమైన సినిమాల‌తో ఆకట్టుకున్నాడు. ఈక్రమంలో ఆయ‌న హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ పరమపద సోపానం (Paramapada Sopanam). అచ్ఛమైన తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుండ‌గా.. గతంలో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాధ్ వ‌ద్ద‌ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగ శివ ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటు దర్శకత్వం వ‌హిస్తున్నాడు. 'ఎస్.ఎస్.మీడియా' సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా గుడిమెట్ల ఈశ్వర్ సహా నిర్మాతగా వ్యవరిస్తున్నారు. ప్ర‌స్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ఫ్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేస్తూ తాజాగా చిన్ని చిన్ని తప్పులేవో (Chinni Chinni Thappulevo) అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. రవితేజ 'ఈగల్' సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 'చిన్ని చిన్ని తప్పులేవో' పాటకి ఆయన అందించిన ట్యూన్ ట్రెండీగా ఉంది. సింగర్స్ పృథ్వీ చంద్ర, అదితి బవరాజు ఆలపించ‌గా, రాంబాబు గోశాల అందించిన సాహిత్యం యువతని ఆకర్షించే విధంగా ఉంది. విడుదలైన కాసేపటికే ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ఈ పాటలనే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వసిస్తున్నారు.

Updated Date - May 24 , 2025 | 10:56 AM