సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మహా శివుడి కథతో మరో సినిమా

ABN, Publish Date - Jun 26 , 2025 | 02:03 AM

మహాశివుడు నేపథ్యంగా రూపుదిద్దుకున్న ‘చంద్రేశ్వర’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. సురేశ్‌ రవి, ఆశా వెంకటేశ్‌ హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న...

మహాశివుడు నేపథ్యంగా రూపుదిద్దుకున్న ‘చంద్రేశ్వర’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. సురేశ్‌ రవి, ఆశా వెంకటేశ్‌ హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జీవీ పెరుమాళ్‌ వర్ధన్‌ దర్శకత్వంలో డాక్టర్‌ రవీంద్రాచారి నిర్మించారు, ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ‘ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషన్స్‌ కలిగిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీవన విధానం ఎలా ఉండేదో చిత్రంలో చూపించాం. ఆర్కియాలజీ బ్యాక్‌డ్రా్‌పలో ఇలాంటి సినిమా ఇంతవరకూ రాలేదని చెప్పాలి. ఈ వారం రెండు భక్తి చిత్రాలు ‘కన్నప్ప’, ‘చంద్రేశ్వర’ విడుదల అవుతున్నాయి. రెండూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 02:03 AM