సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Coin: కథ నచ్చితే.. ఏది ఆలోచించను! ఆటిట్యూడ్ స్టార్.. కొత్త సినిమా లాంచ్‌

ABN, Publish Date - Sep 17 , 2025 | 06:29 PM

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం కాయిన్ ఫస్ట్ ఫ్లిప్ విడుదలైంది.

Coin

జ‌య‌ప‌జ‌యాలతో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకు పోతున్నాడు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahass ). బుధ‌వారం ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా కొత్త చిత్రం ‘కాయిన్’ (Coin) ఫస్ట్ ఫ్లిప్ (గ్లింప్స్, టైటిల్ పోస్టర్) గ్రాండ్‌గా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) చేతుల మీదుగా బుధవారం ఈ లాంచ్ కార్యక్రమం జరిగింది.

శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా, జైరామ్ చిటికెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, పాత ఐదు రూపాయల కాయిన్స్‌ను బ్యాన్ చేయడం, వాటిని మెల్ట్ చేయడం చుట్టూ జరిగిన క్రైమ్ నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా కథను తీర్చిదిద్దామని చిత్ర బృందం తెలిపింది.

ఈ సంద‌ర్భంగా బేబీ డైరెక్ట‌ర్‌ సాయి రాజేష్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ద్వారా కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి రావాలని నేను ఆశిస్తున్నాను. చంద్రహాస్ చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. కథ వినగానే చాలా షాక్ అయ్యాను. ట్రైలర్ వచ్చాక సినిమా మీద అంచనాలు ఇంకా పెరుగుతాయి. టీంకు ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

అనంత‌రం.. హీరో చంద్రహాస్ మాట్లాడుతూ.. “ఈ కథ యథార్థ సంఘటనల మీద ఆధారపడి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. జైరామ్ చాలా బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆయన భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నాను. నాకు కథ నచ్చితే జానర్ ఏమిటో ఆలోచించను, అన్ని రకాల సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. నన్ను నమ్మిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలని, ట్రోల్స్‌కు సమాధానం ఇవ్వాలని ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను” అని చెప్పారు.

దర్శకుడు జైరామ్ చిటికెల మాట్లాడుతూ.. “ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయ్యింది? అనే నేపథ్యంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. చంద్రహాస్ ఎనర్జీ చూసి కథ చెప్పాను. ఆయన నన్ను నమ్మడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత ముందుకెళ్తోంది. సమ్మర్‌లో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం” అని తెలిపారు.

Updated Date - Sep 17 , 2025 | 06:29 PM