సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chaitanya Rao: చాలా క్రూరమైన పాత్ర చేశా

ABN, Publish Date - Aug 24 , 2025 | 05:18 AM

‘ఘాటీ’లో నా పాత్ర రెగ్యులర్‌ విలన్‌లా ఉండదు. ‘విలన్‌గా కాకుండా ఒక మెయిన్‌ క్యారెక్టర్‌గా నిన్ను చూస్తున్నాను’ అని డైరెక్టర్‌ క్రిష్‌ నాతో చెప్పారు. ఐకానిక్‌ క్యారెక్టర్‌ అవుతుందనే నమ్మకం నాకుంది.’ అని అన్నారు...

‘ఘాటీ’లో నా పాత్ర రెగ్యులర్‌ విలన్‌లా ఉండదు. ‘విలన్‌గా కాకుండా ఒక మెయిన్‌ క్యారెక్టర్‌గా నిన్ను చూస్తున్నాను’ అని డైరెక్టర్‌ క్రిష్‌ నాతో చెప్పారు. ఐకానిక్‌ క్యారెక్టర్‌ అవుతుందనే నమ్మకం నాకుంది.’ అని అన్నారు నటుడు చైతన్య రావు. అనుష్కశెట్టి, విక్రమ్‌ప్రభు ప్రధాన పాత్రధారులుగా క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం ‘ఘాటి’. రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య రావు కీలక పాత్రలో నటించారు. సినిమా సెప్టెంబరు 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ‘క్రిష్‌ కథను అద్భుతంగా చెప్పారు. అసలు ఆ క్యారెక్టర్‌లో నన్ను ఎలా ఊహించుకున్నారో అర్థం కాలేదు. చాలా క్రూరమైన పాత్ర అది. లుక్‌ కోసం చాలా టైం పట్టింది. ‘ఘాటీ’ ‘మయసభ’ ఈ రెండూ కూడా నా కెరీర్‌కు గట్టి పునాదులు కాబోతున్నాయి’ అని అన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 05:18 AM