సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bunny Vasu: ఎన్నికల్లో గెలవటానికి.. రాజకీయాలు చేయటం మనవళ్ల కాదు

ABN, Publish Date - Dec 23 , 2025 | 06:49 AM

ఎన్నికల్లో గెలవటానికి.. రాజకీయాలు చేయటం మనవళ్ల కాదని అందుకే ఛాంబర్ ఎన్నిక‌లకు దూరంగా ఉన్నా అంటూ ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీ వాసు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Bunny Vasu

ఎన్నికల్లో గెలవటానికి.. రాజకీయాలు చేయటం మనవళ్ల కాదని అందుకే ఛాంబర్ ఎన్నిక‌లకు దూరంగా ఉన్నా అంటూ ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీ వాసు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోహ‌న్‌లాల్ (Mohanlal,) క‌థానాయ‌కుడిగా కొత్త‌గా రూపొందిన చిత్రం వృష‌భ‌. మ‌ల‌యాళం, తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో రూపొందిన ఈ చిత్రం మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌కు రానుంది.

ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ విడుద‌ల చేస్తుంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి బ‌న్నీ వాస్ (Bunny Vasu) ఈ చిత్ర విష‌యాల‌ను వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో సినిమాలో ఓ జంట‌గా న‌టించిన స‌మ‌ర్జిత్‌, న‌య‌న్ సారిక‌ల‌తో పాటు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన మ‌ణికొండ సంజ‌య్‌, క‌మెడియ‌న్ అలీ పాల్గొన్నారు.

అనంత‌రం జ‌రిగిన మీట్ ది ఫ్రెస్‌లో భాగంగా ఛాంబర్ ఎలక్షన్స్ (Chamber Elections) విషయంలో గీతా ఆర్ట్స్ పై కుట్ర జరిగిందా..? అని ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌న్నీ వాసు స‌మాధాన‌మిస్తూ.. అరవింద్ గారు గతంలోలా ఛాంబర్ వైపు యాక్టివ్ గా లేరని, ఎన్నిక‌ల్లో తొలుత నేను, ఎస్ కె ఎన్ పోటీ కోసం నామినేషన్ వేశాం కానీ ఎన్నికలలో గెలవటానికి రాజకీయాలు చేయటం మనవల్ల కాదని ఉపసంహరించుకున్నాని అన్నారు. ఇక‌ ఎస్ కె ఎన్ కు టెక్నికల్ ఎర్రర్ ఉందని అతని నామినేషన్ తీసుకొలేదని, చివరిలో వంశీ నందిపాటి ని నిలబెట్టామని అన్నారు. ఇక నా అవసరం బన్నీ గారికి ఉండటం కాదు.. అది నా లైఫ్ లో భాగం అని అల్లు అర్జున్ ఉద్దేశ‌ఙంచి చెప్పారు.

Updated Date - Dec 23 , 2025 | 06:49 AM