Bunny Vasu -Vamsi: ఆబ్లిగేషన్ తో కాదు.. కంటెంట్ నచ్చితేనే సినిమా తీసుకుంటున్నాం
ABN , Publish Date - Dec 21 , 2025 | 09:47 PM
లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి తాజాగా 'ఈషా' పేరుతో హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు
లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి తాజాగా 'ఈషా' (Eesha) పేరుతో హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ (hebah patel) కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. ఈ నెల 25న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీవాస్ (bunny vasu) విలేకరులతో మాట్లాడారు...
బన్నీ వాసు మాట్లాడుతూ
'మంచి చిత్రమిది. గుడ్ సినిమా చూశామనే ఫీల్ ఉంటుంది. ఈ సినిమా జనాల్లోకి ఎంత వెళుతున్నానేది విడుదల తరువాత తెలుస్తుంది. చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. మేము ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యాక చిన్న చిన్న మార్పులు చేసాం. ఓ ఆరు నిమిషాలు నిడివి తగ్గించాం. ఆర్‌ఆర్‌లో చిన్న చిన్న మార్పులు చేశాం. మనం చెప్పే మార్పును అంతా తొందరగా ఒప్పుకునే దర్శకుడు కాదు. అతను అంగీకరించబట్టే మార్పులు సాధ్యమైంది.
వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాం. ఇప్పుడు మూడో సినిమాతో రెడీగా ఉన్నాం. ఇదేమి అబ్లీగేషన్ కాదు. సినిమా నచ్చకపోతే వెంటనే వాళ్లకు వేరే ప్రత్యామ్నాయ మార్గం చెబుతాం. ఈసినిమా కంటెంట్ మీద నమ్మంతోనే అసోసియేట్ అయ్యాం. నా సొంత సినిమాలు ఫెయిల్ అయినా డిస్ట్రిబ్యూషన్స్‌లో ఫెయిల్ కాలేదు. ఈ సినిమా విషయంలో ఫెయిల్ కాను అనే నమ్మకం ఉంది. ఇది ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తప్పకుండా రీచ్ అవుతుంది. 'మిత్రమండలి' ఫెయిల్ అయినా ప్రేక్షకుల తీర్పును అంగీకరించి మరుసటి రోజే ఆ సినిమా గురించి మరిచిపోయాను. నేను వంశీ కలిసి చేసిన ఏ సినిమా కూడా ఫెయిల్ కాదనే నమ్మకం ఉంది. ఈషా కూడా ఫస్ట్ కాపీ చూసి తీసుకున్నాం. తప్పకుండా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది.
ఈ మద్య చిన్నసినిమాల పబ్లిసిటి చాలా ఇన్నోవేటింగ్‌గా చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే సినిమాలు ఆడుతున్నాయి. 2026లో నా సినిమాలు మూడు ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తాను. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా, బన్నీవాస్ వర్క్స్‌లో కూడా రెండు సినిమాలు ఉంటాయి. నాగచైతన్య సినిమా స్టోరీ రన్ అవుతుంది. అది లాక్ అయితే ఉంటుంది. ఇట్స్ ఏ మ్యూజికల్ ఫిలిం. దానికి రాక్‌లైన్ వెంకటేష్ మెయిన్ ప్రొడ్యూసర్.
వంశీ నందిపాటి మాట్లాడుతూ
'హారర్, థ్రిల్లర్ ఈ సినిమా ఇది. మొదటి పది నిమిషాల్లోనే మేము ఈ సినిమా ఎందుకు తీసుకున్నామో.. అందరికి అర్థమవుతుంది. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా భయంగా ఉంటుంది. చివరి 15 నిమిషాల సినిమా చాలా కొత్తగా ఉంటుంది. లిటిల్‌హార్ట్స్, రాజువెడ్స్ రాంబాయితో కంపేర్ చేయకూడాదు. దానితో పోల్చకూడదు. ఈ రెండు సినిమాల విషయంలో ఏది అనుకున్నామో అదే జరిగింది. ఈషా విషయంలో కూడా మేము అనుకున్నది జరుగుతుంది. తొలి పదిహేను నిమిషాలు అదిరిపోతుంది. పతాక సన్నివేశాలు స్టనింగ్‌గా ఉంటాయి. ఇది కేవలం హారర్ సినిమానే కాదు అందరికి వర్కవుట్ అవుతుంది. దీనికి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. ఈ సినిమా లాస్ట్ 20 నిమిషాలు హారర్ సినిమాలా ఉండదు. ఓ మంచి విషయం చెప్పారని ఫీల్ అవుతారు. మేము మోర్ దెన్ డిస్ట్రిబ్యూటర్స్ చేసే వర్క్ చేస్తున్నాం. ఎడిట్ రూమ్ దగ్గర్నుంచీ మేము అనుకున్న మార్పులు చేసి..సినిమాను ఓ ప్లానింగ్ ప్రకారం విడుదల చేస్తున్నాం. ఆర్‌ఆర్‌తో పాటు మ్యూజిక్‌లో కూడా ఇన్‌వాల్వ్ అవుతాం.. సినిమాను మార్కెటింగ్ చేసి.. నాన్ థియేట్రికల్‌ను కూడా క్లోజ్ చేసి.. సినిమాలను విడుదల చేస్తున్నాం. మాదొక కొత్త ట్రెండ్. ఫిల్మ్‌ను ఓ స్ట్రాటజీ ప్రకారం విడుదల చేస్తున్నాం. దీనికి పార్ట్ 2 లేదు. చాలా క్లారిటీగా క్లైమాక్స్ ఉంటుంది. రియల్‌లైఫ్ ఇన్‌సిండెట్స్ చాలా ఈ సినిమాలో ఉంటాయి. ఇది మన లైఫ్‌లో కూడా జరిగిందా అనే ఫీల్ కలుగుతుంది. మంచి కంటెంట్ ఉన్నప్పుడు తప్పకుండా ఈటీవీ వాళ్లతో అసోసియేట్‌గా ఉంటాం. పొలిమేర-3 ఫిబ్రవరిలో లేదా మార్చిలోఉంటుంది. ఏషియాన్ సునీల్, బీవీ వర్క్స్‌తో కలిసి ఈసినిమా ఉంటుంది.