Little Hearts: స్టూడెంట్స్ కోసం.. స్పెషల్ షోలు ప్లాన్ చేశాం

ABN , Publish Date - Sep 01 , 2025 | 09:48 PM

చాలా కాలం త‌ర్వాత యూత్ ఫుల్ ఫన్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కూ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిన సినిమా “లిటిల్ హార్ట్స్”.

Little Hearts

చాలా కాలం త‌ర్వాత యూత్ ఫుల్ ఫన్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కూ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిన సినిమా “లిటిల్ హార్ట్స్”. ఈ సినిమా ద్వారా "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్ హీరోగా, "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు"తో గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగరం హీరోయిన్‌గా న‌టించారు.

ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, "90s మిడిల్ క్లాస్ బయోపిక్" దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలను బన్నీ వాస్, వంశీ నందిపాటి తీసుకున్నారు. సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ఈ సినిమా మాకు మొదట వంశీ నందిపాటి ద్వారా తెలిసింది. తర్వాత ఆదిత్య హాసన్ వివరించగా ఫైనల్‌గా చూసి బాగా నచ్చింది. కంటెంట్ కొత్తగా ఉంది. ఫ్యామిలీ, యూత్ అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఎలాంటి అశ్లీలత లేకుండా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా ఉంటుంది. ముఖ్యంగా 16–20 ఏళ్ల యూత్‌కు బాగా నచ్చుతుంది. స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత, ఈ సినిమాలో ఇంటర్, ఎంసెట్ ఎగ్జామ్స్ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుంది. థియేటర్స్‌లో స్లో ఓపెనింగ్ అయినా, టాక్ బాగుంటే షోలు పికప్ అవుతాయి. చిన్న సినిమాలకు తక్కువ టికెట్ రేట్లు ఉంటే ఇంకా బావుంటుంది” అన్నారు.

అనంత‌రం వంశీ నందిపాటి మాట్లాడుతూ.. “లిటిల్ హార్ట్స్ 80% పూర్తయ్యాక మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. ఒక ఆడియన్స్‌గా చూసినప్పుడు థియేట్రికల్ కంటెంట్‌గా బాగా నచ్చింది. యంగ్ టీమ్ ఎనర్జీ స్క్రీన్‌పై ఫుల్‌గా కనబడుతుంది. ఈటీవీ విన్ కంటెంట్ ఎప్పుడూ మన చిన్నప్పటి జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసేలా ఉంటుంది. ఈ సినిమా కూడా యూత్ లవ్, ఫన్, ఎమోషన్ మిక్స్‌తో బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇప్పటికే స్టూడెంట్స్ కోసం స్పెషల్ షోలు ప్లాన్ చేశాం. 4న పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఉంటాయి. దాదాపు 170 థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం” అన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 09:51 PM