Mithra Mandali: బన్నీ వాస్.. ప్రియదర్శి 'మిత్రమండలి'
ABN, Publish Date - Jun 06 , 2025 | 01:02 PM
బన్నీ వాస్ గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చి మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్న సినిమా టైటిల్, నటుల వివరాలను శుక్రవారం ప్రకటించారు.
అల్లు అర్జున్ స్నేహితుడిగా, గీతా ఆర్ట్స్2 వ్యవహారాలు చూసుకుంటున్న బన్నీ వాస్ (Bunnyvas) సడన్‌గా కొత్తగా బీవీ వర్క్స్ (BV Works) పేరిట కొత్త బ్యానర్ స్థాపించి సప్త అశ్వ క్రియేటివ్స్ (SaptaAswaCreatives) , వైరా ఎంటర్టైన్మెంట్స్ (Vyra Entertainments) సంస్థలతో కలిసి సంయిక్తగా ఓసినిమా రూపొందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఓ పోస్టర్ రిలీజ్ చేసి జూన్ 6న టైటిల్, యాక్టర్స్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలో.. మేకర్స్ శుక్రవారం ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. మిత్రమండలిగా వస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి (Priyadarshi Pulikonda), రాగ్ మయూర్ (Rag Mayur), ప్రసాద్ బెహరా (Prasad Behra), విష్ణు (VishnuOi) కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. వీరితో పాటు ఫేమస్ యూట్యూబర్, ఇన్ ఫ్లూయెన్సర్ నిహారిక (Niharika Nm) ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది.
ఫన్, మిస్టరీ, జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంతో జయేంద్ర ఎస్ (VijayendarS) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా ఈ సినిమా పూర్తి చేసి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.